• facebook
  • whatsapp
  • telegram

TS Inter Results: తెలంగాణ ఇంటర్మీడియట్‌లో 62 శాతం ఉత్తీర్ణత

‣ రెండు సంవత్సరాల్లోనూ బాలికలదే అధిక్యం 

TS Inter Results: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో (TS Inter Results 2024) దాదాపు 62 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బుదవారం (ఏప్రిల్‌24) ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాలను బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ప్రథమ సంవత్సరంలో 2.87 లక్షల మంది, ద్వితీయ సంవత్సరంలో 3.22 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో మొత్తం ఉత్తీర్ణత శాతం 60.01 కాగా,  బాలికలు 68.35 బాలురు 51.5 శాతం సాధించారు. ద్వితీయ సంవత్సర మొత్తం ఉత్తీర్ణత 64.19 శాతం కాగా బాలికలు 72.53 బాలురు 56.1శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్‌పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మార్చి 10 నుంచి ఏప్రిల్‌ 10 వరకు పేపర్ల మూల్యాంకనం జరిగింది.


     ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి....

          

Jr.INTER General
 
Vocational
Sr.INTER General Vocational
 

                    

What Next After Intermediate?

* Degree Courses

* Engineering

* Medical Courses

* Commerce Courses

* Law Courses

* Agricultural Education

* Fashion

* Animation

Updated Date : 24-04-2024 11:50:03

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం