* రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే..
ఈనాడు ప్రతిభ డెస్క్: ఎన్టీఏ శ్రేష్ఠ- నెట్స్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ(రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హైస్కూల్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్)- నెట్స్ 2024 పథక ప్రకటనను ఎన్టీఏ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్సీ బాలబాలికలు సీబీఎస్ఈ అనుబంధ ప్రైవేట్ విద్యా సంస్థల్లో తొమ్మిది, పదకొండు తరగతుల్లో ప్రవేశాలు పొందవచ్చు. శ్రేష్ఠ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 3వేల సీట్లను భర్తీ కానున్నాయి. ఈ పరీక్షను మే 24న నిర్వహించారు.
ఎన్టీఏ శ్రేష్ఠ 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.