• facebook
  • whatsapp
  • telegram

RJUKT: నాలుగు జిల్లాలకే సగం ‘బాసర’ సీట్లు

* సీట్లు పొందిన వారిలో 69.51% మంది అమ్మాయిలే

ఈనాడు, హైదరాబాద్‌: బాసర ఆర్‌జీయూకేటీలోని మొత్తం సీట్లలో సగం నాలుగు జిల్లాల విద్యార్థులే దక్కించుకున్నారు. ఆ వర్సిటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ చదివేందుకు పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపికైన విద్యార్థుల ప్రాథమిక జాబితాను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇన్‌ఛార్జి ఉపకులపతి వి.వెంకటరమణ, వర్సిటీ అధికారులు  జులై 3న  సచివాలయంలో విడుదల చేశారు. మొత్తం 1,500 సీట్లు ఉండగా... 1404 సీట్లకు ఎంపికైన వారి జాబితాను వెల్లడించారు. మరో 96 సీట్లను దివ్యాంగులు, ఆర్మీ, ఎన్‌సీసీ, క్రీడా తదితర ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు కేటాయిస్తారు. ప్రాథమికంగా ఎంపికైన వారికి బాసర ఆర్‌జీయూకేటీ ప్రాంగణంలో ఈనెల 8, 9, 10 తేదీల్లో తొలి విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. కార్యక్రమంలో సంయుక్త కన్వీనర్లు డాక్టర్‌ కె.పామని, డాక్టర్‌ హెచ్‌.దత్తు తదితరులు పాల్గొన్నారు. 

అత్యధిక సీట్లు కొన్ని జిల్లాలకే... 

ప్రతి సంవత్సరం ఈ వర్సిటీలోని అత్యధిక సీట్లు కొన్ని జిల్లాల విద్యార్థులకే దక్కుతున్నాయి. మొత్తం 1,404 సీట్లలో ఈసారి సిద్దిపేట, నిజామాబాద్, సంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాలకు 700 దక్కాయి. పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన, అందులోనూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఇక్కడ సీట్లు పొందుతారు. జిల్లాల వారీగా కోటా లేకపోవడంతో కొన్ని జిల్లాల వారు నష్టపోతున్నారన్న అభిప్రాయముంది. అందుకే మరో ప్రాంగణం ప్రారంభిస్తే అన్ని జిల్లాలకు సమప్రాధాన్యం దక్కుతుందని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.

ఇవీ ముఖ్యాంశాలు... 

1,404 మందిలో అమ్మాయిలు 976 (69.51 శాతం), అబ్బాయిలు 428 (30.49 శాతం) మంది ఉన్నారు. 
మొత్తం సీట్లలో 95% ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికే దక్కాయి.  ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి వచ్చిన జీపీఏకు 0.4% అదనంగా కలుపుతారు. ఆ విధంగా 89.6% మంది సీట్లు సాధించారు. 
అత్యధికంగా విద్యార్థులు ఎంపికైన తొలి పది జిల్లాలు: సిద్దిపేట (330), నిజామాబాద్‌ (157), సంగారెడ్డి (132), సిరిసిల్ల (81), నిర్మల్‌ (72), కరీంనగర్‌(66), కామారెడ్డి (64), నల్గొండ (61), రంగారెడ్డి(46), సూర్యాపేట (45).
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

‣ జాగ్రఫీదే హవా!

‣ కేంద్ర శాఖల్లో 17,727 కొలువులు!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.