• facebook
  • whatsapp
  • telegram

AP EAPCET Counselling: ఈఏపీసెట్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం

* నమోదులో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

* ర్యాంకు ఆధారంగా సీటు కేటాయింపు

 



ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఏపీలో బీటెక్‌ ఇంజినీరింగ్‌ కోర్సు ప్రవేశాలకు కళాశాలలు సమాయత్తమవుతున్నాయి. ఏపీ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించడంతో మంగళవారం (జులై 9) వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. కాలేజీల్లో ప్రవేశాలకు జులై 1వ తేదీన రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా, 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో ధ్రువతపత్రాల పరిశీలన జరుగుతుంది. జులై 12వ తేదీ వరకు ఐచ్ఛికాల ఎంపిక, మార్పులకు 13వ తేదీ, 16న సీట్ల కేటాయింపు, 17 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులు కళాశాలలో ప్రవేశం పొందేందుకు అవకాశముంటుంది. జులై 19వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా బీటెక్‌ కోర్సు సీట్ల భర్తీ జరుగుతుంది. ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులకు ఆసక్తి ఉన్న బ్రాంచి, కాలేజీని ఎంపిక చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 232 ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతులిస్తూ ప్రభుత్వం జులై 8న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 24 విశ్వవిద్యాలయాల కళాశాలలు, 208 ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి.

బ్రాంచి ఎంపికలో స్పష్టత అవసరం

అధికారిక వెబ్‌సైట్‌లో కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్స్ సెలక్షన్‌ లింక్‌పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ప్రాధాన్య క్రమంలో కోర్సు, ఎంపికను నమోదు చేయాలి. ఎంపికలను సేవ్ చేసి, చివరగా సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. వెబ్‌ ఆప్షన్స్‌ ఎంపిక సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రాధాన్యమున్న బ్రాంచి ఎంపికలో స్పష్టత ఉండాలి. స్నేహితులు, బంధువులు చెప్పారని కాకుండా ఆసక్తి, భవిష్యత్తు ఉద్యోగావకాశాలను దృష్టిలో ఉంచుకుని కోర్సు, కాలేజీని ఎంచుకోవాలి. నచ్చని బ్రాంచులను ఎంపిక చేసుకుని చేరిన తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంజినీరింగ్‌ కోర్సుల్లో అన్ని విభాగాలకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. ఎంపిక చేసుకున్న విభాగంలో సీటు లభిస్తే, అందులో చేరి అకడమిక్‌లో రాణిస్తూ, నైపుణ్యాభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే ఆశించిన విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థి తల్లిదండ్రులు ఫలానా బ్రాంచీలోనే బీటెక్‌ చేయాలి అంటూ విద్యార్థులపై ఒత్తిడి చేయడం కంటే విద్యార్థి అభిరుచి, ఆసక్తిని గమనించి చేర్పించడం మంచిది.

ఈ సర్టిఫికెట్స్‌ తప్పనిసరి

* ఏపీ ఈఏపీసెట్‌-2024 ర్యాంకు కార్డు 

* ఏపీ ఈఏపీసెట్‌-2024 అడ్మిట్‌కార్డు

* ఇంటర్మీడియెట్‌ మార్కుల జాబితా 

* పదో తరగతి మార్కుల జాబితా 

* ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ 

* స్టడీ సర్టిఫికెట్స్‌ 

* బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రం 

* ఆదాయ ధ్రువీకరణ పత్రం 

*  రేషన్‌ కార్డు 

* పాస్‌పోర్ట్‌ సైజ్‌ కలర్‌ ఫొటోలు



   ఈఏపీసెట్‌ వెబ్‌ ఆప్షన్ల నమోదు కోసం క్లిక్‌ చేయండి  



  TS  EAPCET Study Material    
 

  Physics
  Maths
 Chemistry
 Botany
 Zoology
♦ Previous Papers  
 Model Papers  


 

  TS  EAPCET Mock Counsellings 2024    

* Engineering

Agriculture and Medical

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.