• facebook
  • whatsapp
  • telegram

Group-2: గ్రూప్‌-2 వాయిదా వేయాలంటూ ఆందోళన

గాంధీనగర్, లాలాపేట- న్యూస్‌టుడే: డీఎస్సీ వాయిదా వేయాలని.. గ్రూప్‌-2 పోస్టులు పెంచాలని.. గ్రూప్‌-2 పరీక్షను డిసెంబరు వరకు వాయిదా వేయాలని విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీలో కొందరు విద్యార్థి సంఘాల నాయకులను, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం పలువురు నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఓయూలో సోమవారం తెల్లవారుజాము నుంచే పోలీసులు అరెస్టులు ప్రారంభించారు. సచివాలయ ముట్టడికి మద్దతు ప్రకటించిన సంఘాల నాయకులను హాస్టళ్లలోకి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో భారాస విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, విద్యార్థి నాయకులు అనిల్, కొంపల్లి నరేశ్, మిథున్‌ ప్రసాద్, రమేశ్‌ గౌడ్, అవినాష్‌ ఉన్నారు. మరోవైపు గ్రూప్‌-2 వాయిదా వేయాలంటూ హైదరాబాద్‌లోని చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం నుంచి శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని నిరుద్యోగులు సోమవారం సాయంత్రం పోలీసులకు విజ్ఞప్తి చేయగా వారు నిరాకరించారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారంతా గ్రంథాలయం ఆవరణలోనే ధర్నాకు దిగారు. పోలీసులు గేటు వద్దే మోహరించి.. నిరసనకారులను బయటికి వెళ్లనివ్వలేదు. మరికొందరు పోలీసులు గ్రంథాలయంలోకి రావడంతో నిరుద్యోగులు లోపలికి వెళ్లి ఇనుపగ్రిల్స్‌ను మూసివేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కొందరిని పోలీసులు అరెస్టు చేసి వివిధ ఠాణాలకు తరలించారు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు

‣ వాయుసేనలో అగ్నివీరులవుతారా?

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.