విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

B.Tech Seats: కొత్త బీటెక్‌ సీట్లు 10,034

  • జులై 27, 28న ఇంజినీరింగ్‌ వెబ్‌ ఆప్షన్లు
  • రెండో విడతకు అందుబాటులో 29,777 సీట్లు

ఈనాడు, హైదరాబాద్‌: మరో విడత అదనంగా ఇంజినీరింగ్‌ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్‌ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. ఫలితంగా వాటిల్లో 70 శాతం కన్వీనర్‌ కోటా కింద 7,024 సీట్లను రెండోవిడత కౌన్సెలింగ్‌లో చేర్చారు. మొదటివిడతలో మిగిలిపోయిన 22,753 కలిపి మొత్తం 29,777 సీట్లు రెండోవిడతలో అందుబాటులోకి వచ్చాయి. వాటికి జులై 27, 28న వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మెరుగైన సీట్లు, కళాశాలల కోసం తొలి విడతలో సీట్లు పొందిన వారు సైతం పోటీ పడొచ్చని ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ శ్రీదేవసేన తెలిపారు.

మొత్తం 1,11,480 సీట్లు..
కన్వీనర్, బీ కేటగిరీ కలుపుకొని రాష్ట్రంలోని 176 ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో మొత్తం బీటెక్‌ సీట్ల సంఖ్య 1,11,480కి చేరింది. అందులో కన్వీనర్‌ కోటా కింద 85,718 సీట్లున్నాయి. గత ఏడాది మొత్తం సీట్లు 1,10,069. అంటే గత ఏడాది కంటే ఈసారి 1,411 సీట్లు అధికంగా ఉన్నాయి.

జీఓ లేకుండానే..
సాధారణంగా అదనపు సీట్లు మంజూరుచేస్తే విద్యాశాఖ జీఓ జారీ చేస్తుంది. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. అంతర్గతంగా రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖకు ఆదేశాలు వెళ్తున్నాయి తప్ప జీఓ ఇవ్వడం లేదు. కన్వీనర్‌ కోటా కింద 7,024 సీట్లు అదనంగా చేరుతున్నాయని ఇంజినీరింగ్‌ ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ ప్రకటన పంపారు తప్ప.. ఎన్ని కళాశాలలకు అన్న వివరాలు లేవు. ఏ ప్రాతిపదికన సీట్లు మంజూరు చేశారు.. మిగిలిన సీట్లు ఎందుకు తిరస్కరించారన్న దానిపై పారదర్శకత కొరవడిందన్న విమర్శలు వస్తున్నాయి.

సీట్ల లెక్క ఇదీ...
మొదటి విడతలో కన్వీనర్‌ కోటా సీట్లు : 78,694
కేటాయించిన సీట్లు : 75,200
సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసినవారు : 55,941
మొదటివిడతలో మిగిలిన సీట్లు : 22,753
రెండోవిడతకు మంజూరైన అదనపు సీట్లు : 7,024
రెండోవిడతలో అందుబాటులో ఉన్న సీట్లు  : 29,777

Updated at : 27-07-2024 13:08:41

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం