• facebook
  • whatsapp
  • telegram

Degree: డిగ్రీలో బీకాం క్రేజ్‌

* ప్రవేశాల్లో 41.60 శాతం వాటా

* అబ్బాయిల కన్నా అమ్మాయిల ప్రవేశాలే ఎక్కువ

* 1.84 లక్షల సీట్ల ఖాళీ

ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీలో బీకాం కోర్సు చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుత విద్యాసంవత్సరం ఈ కోర్సులో 85,153 మంది విద్యార్థులు దోస్త్‌-2023 ద్వారా ప్రవేశాలు పొందారు. అంటే మొత్తం కోర్సులతో పోల్చితే బీకాం వాటా 41.60 శాతం. బీకాం తర్వాత బీఎస్సీ లైఫ్‌ సైన్సెస్‌ కోర్సులకు ద్వితీయ ప్రాధాన్యం లభించింది. వీటిలో 43,180 మంది విద్యార్థులు చేరారు. కొత్తగా డిగ్రీ కోర్సుల్లో అంతర్భాగంగా ప్రవేశపెట్టిన స్కిల్‌సెక్టార్‌ కోర్సుల్లో 1,398 మంది, బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ ఆనర్స్‌లో 889 మంది విద్యార్థులు సీట్లు పొందారు. డిగ్రీలో మొత్తం 3.88 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా వాటిలో ఇప్పటివరకు 2.04 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 1.84 లక్షల సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు కళాశాలలతో పోల్చితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు మెరుగ్గా ఉన్నాయి. ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో కనీసం 50 శాతం సీట్లు కూడా భర్తీ కాలేదు. గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అన్ని సొసైటీల పరిధిలో మొత్తం 78 గురుకుల డిగ్రీ కళాశాలల్లో 21,254 సీట్లు ఉన్నాయి. వాటిలో సగం కూడా భర్తీ కాలేదు.


* డిగ్రీ కళాశాలల ప్రవేశాల్లో అమ్మాయిలే అగ్రస్థానంలో నిలిచారు. ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల డిగ్రీ కళాశాలల్లో కలిపి మొత్తం 2,04,674 మంది ప్రవేశాలు పొందితే ఇందులో 1,08,150 మంది అమ్మాయిలు ఉన్నారు. రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో తెలంగాణతోపాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల విద్యార్థులు సీట్లు పొందారని ఉన్నత విద్యామండలి తెలిపింది.


కామర్స్ కోర్సులు


‣ కామ‌ర్స్ ప్రొఫెష‌న‌ల్ కోర్సుల‌తో పీహెచ్‌డీలోకి ప్ర‌వేశం!

‣ ఏ పేపర్లో ఏవి ముఖ్యం? 

‣ సీఏ కోర్సు వేగవంతం!

‣ బ్యాంకింగ్‌ - ఫైనాన్స్‌


 మరిన్ని స్టోరీస్‌ కోసం క్లిక్‌ చేయండి...

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.