• facebook
  • whatsapp
  • telegram

TS Jobs: దేశంలోనే అత్యధిక ఉద్యోగాల భర్తీ తెలంగాణలోనే

* పూర్తి సమాచారంతో వెబ్‌సైట్‌ ప్రారంభం: కేటీఆర్‌


ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తూ రాష్ట్ర యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. తాము లక్ష ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి హామీ ఇచ్చామని, తొమ్మిదిన్నర సంవత్సరాల్లో 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించి, ఇందులో ఇప్పటికే 1.60 లక్షలకుపైగా భర్తీ చేశామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాల సమాచారంతో రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను కేటీఆర్‌ న‌వంబ‌రు 21న‌ ప్రారంభించారు. ‘‘జనాభాతో పోల్చి చూసినప్పుడు దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఇన్ని కొలువులు ఇచ్చిన తర్వాత కూడా కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం వల్ల యువతలో పలు అపోహలు నెలకొన్నాయి. ఇటీవల యువతతో జరిపిన భేటీలో ఈ అంశాలన్నీ చర్చకు వచ్చాయి. ఉద్యోగాల భర్తీపై సమాచారం ఇచ్చిన తర్వాత వారిలో సంతృప్తి వ్యక్తమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం. మిగిలిన కొలువుల భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేస్తాం. శిక్షణ కోసం మరిన్ని స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేస్తాం. ‌www.telanganajobstats.in లో వివరాలన్నీ ఉంచాం. రాష్ట్రంలోని ప్రతీ విద్యార్థి ఈ వెబ్‌సైట్‌ ద్వారా నిజాలు తెలుసుకోవాలి’’ అని కేటీఆర్‌ కోరారు.



మరింత సమాచారం... మీ కోసం!

‣ బీటెక్‌తో ఆర్మీలో ఉద్యోగాలు

‣ నాలుగేళ్ల కోర్సు.. నైపుణ్యాలతో మెరుగు!

‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.