కృష్ణలంక, న్యూస్టుడే: జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం, స్కిల్ డెవలప్మెంట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నిరుద్యోగులకు నవంబరు 25వ తేదీన విజయవాడలోని ఉపాధి కల్పనా కార్యాలయం ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పనా అధికారి దేవరపల్లి విక్టర్ బాబు నవంబరు 23న తెలిపారు. హ్యూమన్ ఫస్ట్, టీమ్ లీఫ్, హెటెరో ల్యాబ్స్, జేెన్యూస్ సెక్యూరిటీ సర్వీసెస్, టాటా ఎలక్ట్రానిక్స్, మ్యాట్రీ హ్యూమన్ సోర్స్, నవతా ట్రాన్స్పోర్ట్, సుధీర్ టింబర్ డిపో తదితర సంస్థల్లో వివిధ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లమా ఇన్ మెకానిక్స్, ఇంకా ఏదైనా డిగ్రీ పూర్తి చేసి 18-35 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులు బయోడేటా, ధ్రువపత్రాల జెరాక్స్ కాపీలు, ఆధార్ కార్డుతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 81424 16211 నంబరులో సంప్రదించాలని చెప్పారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జేఈఈ మెయిన్ విజయానికి కీలకాంశాలు
‣ ఒకటే పరీక్ష.. లక్షన్నర కొలువులు!
‣ ఎయిమ్స్ సంస్థల్లో 3 వేల ఉద్యోగాలు
‣ స్టేట్ బ్యాంకులో 8,773 క్లర్క్ కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.