ఈనాడు, అమరావతి: డీ ఫార్మసీ ప్రవేశాల కౌన్సెలింగ్లో 531 మందికి సీట్లు కేటాయించినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 9 ప్రభుత్వ కళాశాలల్లో 506 సీట్లు ఉండగా 223 మంది ప్రవేశాలు పొందారన్నారు. 39 ప్రైవేటు కళాశాలల్లో 2,538 సీట్లకు 308 భర్తీ అయ్యాయని వెల్లడించారు. ధ్రువపత్రాల పరిశీలనకు 540 మంది హాజరు కాగా 531 మంది కళాశాలల ఎంపికకు వెబ్ ఐచ్ఛికాలు ఇచ్చారని పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు డిసెంబరు ఏడో తేదీలోపు కళాశాలల్లో చేరాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!
‣ 26,146 కానిస్టేబుల్ ఖాళీలకు ప్రకటన
‣ ఐటీఐతో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు
‣ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో కెరియర్ అవకాశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.