• facebook
  • whatsapp
  • telegram

Schools: పాఠశాలల్లో ఈఎండీపీ అమలుకు ఒప్పందం

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో రాబోయే మూడేళ్ల పాటు ఎంట్రప్రెన్యూరియల్‌ మైండ్‌సెట్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఈఎండీపీ) అమలు చేసేందుకు అప్లౌటౌన్‌ ఇంటర్నేషనల్‌, ఉద్యమ్‌ లెర్నింగ్‌ ఫౌండేషన్‌, రీప్‌ బెనిఫిట్‌తో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఆలోచనల అభివృద్ధితో పాటు ఆర్థిక నైపుణ్యాలు అందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని వెల్లడించారు. అమెజాన్‌ రూపొందించిన ఏపీ ఎంట్రప్రెన్యూరియల్‌ మైండ్‌సెట్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ఎక్స్‌పో-2023లో ప్రదర్శించిన అన్ని ప్రాజెక్టులతో కూడిన బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ 26,146 కానిస్టేబుల్‌ ఖాళీలకు ప్రకటన

‣ ఐటీఐతో విద్యుత్‌ సంస్థలో ఉద్యోగాలు

‣ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో కెరియర్ అవకాశాలు

‣ డిగ్రీతో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటిలో ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.