• facebook
  • whatsapp
  • telegram

TS Eamcet: తెలంగాణలో ఎంసెట్‌.. ఇక నుంచి ఈఏపీసెట్‌

* రాష్ట్రంలో మే 9 నుంచి 13 వరకు నిర్వహణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఎప్‌సెట్‌ సహా మొత్తం ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మెడికల్‌ ప్రవేశాలను ఎంసెట్‌ నుంచి తొలగించి నీట్‌ ద్వారా కల్పిస్తున్న నేపథ్యంలో ఈసారి దాని పేరును ఎప్‌సెట్‌ (ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ సెట్‌-ఈఏపీసెట్‌)గా మార్చారు. అంటే మెడికల్‌ స్థానంలో ఫార్మసీని చేర్చారు. ఇప్పుడది తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ సెట్‌గా మారింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో జారీ చేశారు. ఎప్‌సెట్‌ను మే 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తారు. తొలి మూడు రోజులు ఇంజినీరింగ్‌ విభాగం, చివరి రెండు రోజులు అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగం పరీక్షలు ఉంటాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో గురువారం ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, ఉపాధ్యక్షుడు షేక్‌ మహమూద్‌, ఉపకులపతులతో కలిసి ఆయా పరీక్షల తేదీలను బుర్రా వెంకటేశం విడుదల చేశారు.

పరీక్షలను నిర్వహించే విశ్వవిద్యాలయాల్లో ఎటువంటి మార్పు లేదు. ఆయా పరీక్షల కన్వీనర్లను ఈనెల 27న ప్రకటించనున్నారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈసారి మొత్తం ఏడు ప్రవేశ పరీక్షల్లో 3 మేలో, 4 జూన్‌లో జరగనుండటం విశేషం. ఈసెట్‌, ఎప్‌సెట్‌, ఎడ్‌సెట్‌లు మాత్రమే మే నెలలో నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌ పరీక్షలను టీసీఎస్‌ అయాన్‌ సంస్థ నిర్వహిస్తుంది. ఆ సంస్థలో ఇతర పరీక్షలు కూడా ఉండటంతో రాష్ట్రంలోని ప్రవేశ పరీక్షలను జూన్‌లో కూడా నిర్వహించక తప్పడం లేదని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు, జేఎన్‌టీయూహెచ్‌ ఉపకులపతి ఆచార్య కట్టా నర్సింహారెడ్డి, ఓయూ వీసీ ఆచార్య రవీందర్‌, కాకతీయ వర్సిటీ వీసీ తాటికొండ రమేశ్‌ పాల్గొన్నారు.

* ఫిబ్రవరి నెలాఖరు నుంచి నోటిఫికేషన్లు

ఫిబ్రవరి నెలాఖరు నుంచి నోటిఫికేషన్ల జారీ మొదలుకానుంది. మార్చి మొదటి వారంలో ఎప్‌సెట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది.

తెలంగాణలో నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీల వివరాలు...   
 

పరీక్ష        తేదీలు      నిర్వహించే  యూనివర్సిటీ
ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌  మే 9 నుంచి 11 వరకు  జేఎన్‌టీయూహెచ్‌
ఈఏపీసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ మే 12, 13   జేఎన్‌టీయూహెచ్‌
ఈసెట్‌   మే 6    ఉస్మానియా
ఐసెట్‌    జూన్‌ 4    కాకతీయ 
పీజీఈసెట్‌    జూన్‌ 6 నుంచి 8 వరకు   జేఎన్‌టీయూహెచ్‌
పీఈసెట్‌   జూన్‌ 10 నుంచి 13 వరకు శాతవాహన 
ఎడ్‌సెట్‌ మే 23 మహాత్మాగాంధీ


 

 తెలంగాణ ఎంసెట్/ఈఏపీసెట్‌  స్టడీమెటీరియల్  
 

1.భౌతికశాస్త్రం
2.గణితశాస్త్రం
3.రసాయన శాస్త్రం
4.వృక్షశాస్త్రం
5.జంతుశాస్త్రం


  పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు   

  నమూనా ప్రశ్నపత్రాలు   


మరింత సమాచారం... మీ కోసం!

‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు

‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.