• facebook
  • whatsapp
  • telegram

Teacher Jobs: గురువు కొలువుపై గురి

* దేశంలో రాష్ట్ర అబ్బాయిలది 4వ స్థానం

* 11వ స్థానంలో అమ్మాయిలు

* గ్రామీణ యువతపై అసర్‌ సర్వే-2023 వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం ఎంతోమంది కల. దీన్ని కావాలనుకునే రాష్ట్ర అబ్బాయిల శాతం దేశవ్యాప్త సగటుతో పోల్చుకుంటే అధికంగా ఉండటం విశేషం. దేశంలో ప్రతి వంద మంది అబ్బాయిల్లో ఆరుగురు టీచర్‌ కొలువు సాధించడం తమ లక్ష్యమని తెలపగా.. రాష్ట్రంలో 8.9% మంది ఆసక్తి కనబర్చారు. ఈ ఉద్యోగం సాధించడమే తమ లక్ష్యమని చెప్పినవారిలో రాష్ట్రానికి చెందిన అబ్బాయిలు దేశంలో 4వ, అమ్మాయిలు 11వ స్థానంలో నిలిచారు. ప్రథమ్‌ స్వచ్ఛంద సంస్థ ఇటీవల చేపట్టిన వార్షిక విద్యాస్థితి నివేదిక(అసర్‌)-2023 సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా 14-18 వయసు గ్రామీణ యువతపై 28 రాష్ట్రాల్లో సర్వే చేశారు. టీచర్‌ ఉద్యోగం కావాలని అబ్బాయిలు ఎక్కువగా కోరుకుంటున్న రాష్ట్రాల్లో త్రిపుర(22.9%), రాజస్థాన్‌(20.4%), ఛత్తీస్‌గఢ్‌(9.9%), అమ్మాయిలు ఎక్కువగా కోరుకుంటున్న రాష్ట్రాల్లో రాజస్థాన్‌(33.6%), త్రిపుర(31.5%), హరియాణా(25.2%) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. సొంత జిల్లాలో, కుటుంబంతో ఉంటూ పనిచేయవచ్చని ఎక్కువమంది ఈ ఉద్యోగంపై ఆసక్తి కనబరచి ఉంటారని డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.