• facebook
  • whatsapp
  • telegram

BED Seats: బీఈడీ స్పాట్‌, యాజమాన్య కోటా సీట్ల భర్తీకి షెడ్యూల్‌  

ఈనాడు, అమరావతి: బీఈడీ కళాశాలల్లో స్పాట్‌, యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ విడుదల చేసింది. కన్వీనర్‌ కోటాలో మిగిలిన సీట్లను స్పాట్‌ కోటా కింద ఏప్రిల్‌ 12లోపు సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది.  మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3వరకు ప్రవేశాలు నిర్వహించాలని, ఈ వివరాలను వెబ్‌ పోర్టల్‌లో ఏప్రిల్‌ 12లోపు అప్‌లోడ్‌ చేయాలని పేర్కొంది. ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్లను స్థానికులతోనే భర్తీ చేయాలని, సబ్జెక్టు మెథడాలజీ ప్రకారమే సీట్లు కేటాయించాలని సూచించింది. యాజమాన్య కోటా 25 శాతం సీట్ల కోసం ఏప్రిల్‌ 4నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని యాజమాన్యాలను ఆదేశించింది. అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 20 వరకు అవకాశం కల్పించింది. యాజమాన్య కోటా (కేటగిరి-బీ) రిజిస్ట్రేషన్‌కు ఎడ్‌సెట్‌ ఉత్తీర్ణులైన వారు రూ.వెయ్యి, అనుత్తీర్ణులైన వారు రూ.1,400 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం... మీ కోసం!

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.