• facebook
  • whatsapp
  • telegram

ANU ICET: ఏఎన్‌యూ ఐసెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం


 

ఎ.ఎన్‌.యు, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహించే ఐసెట్‌-24 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏఎన్‌యూ ఐసెట్‌ ద్వారా ఏడు కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంబీఏ జనరల్, ఎంబీఏ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ ఇంటర్‌నేషనల్‌ బిజినెస్‌ స్టడీస్, ఎంబీఏ మేనేజ్‌మెంట్, ఎంబీఏ టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్‌మెంట్, ఎంబీఏ ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలుంటాయని అడ్మిషన్‌ విభాగం సంచాలకురాలు డాక్టర్‌ అనిత చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్‌ 5లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. రూ.750 అపరాధ రుసుంతో జూన్‌ 12, రూ.1000 అపరాధ రుసుంతో జూన్‌ 18లోపు ఫీజులు చెల్లించాలని కోరారు. జూన్‌ 18న ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశముందని, మరిన్ని వివరాలను ప్రవేశాల విభాగం వెబ్‌సైట్‌లో ఉంచామని పేర్కొన్నారు. 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్మీడియట్లో ఏ కెరియర్‌కు ఏ గ్రూపు?

‣ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ మెలకువలు

‣ నలుగురితో కలిసిపోవాలంటే...

‣ బృందంతో నడుస్తూ..!

‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

Published Date : 01-06-2024 11:43:08

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం