• facebook
  • whatsapp
  • telegram

TG ECET: 8 నుంచి ఈసెట్‌.. 20 నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌



ఈనాడు, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్‌ రెండో ఏడాదిలో చేరేందుకు ఈసెట్‌ కౌన్సెలింగ్, పదో తరగతి పూర్తయిన విద్యార్థులు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఖరారయ్యాయి. మే 24న ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ప్రవేశ కమిటీల సమావేశాలు జరిగాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆయా సెట్ల కన్వీనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడతల వారీ కౌన్సెలింగ్‌ తేదీలను విడుదల చేశారు. 


ముఖ్యాంశాలు..

ఈసెట్‌..

జులై 15 నుంచి 25 వరకు చివరి విడత కౌన్సెలింగ్‌ జరుగుతుంది.

జులై 24న స్పాట్‌ ప్రవేశాల మార్గదర్శకాలు జారీ చేస్తారు. జులై 30 నాటికి స్పాట్‌ ప్రవేశాలు పూర్తవుతాయి.

పాలిసెట్‌.. 

చివరి విడత కౌన్సెలింగ్‌ జులై 7న మొదలై 16న ముగుస్తుంది.

జులై 15 నుంచి పాలిటెక్నిక్‌ డిప్లొమా విద్యా సంవత్సరం మొదలవుతుంది. 15 నుంచి 17 వరకు విద్యార్థులకు ఓరియంటేషన్‌ తరగతులు, 18 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

జులై 21 నుంచి 24 వరకు అంతర్గత స్లైడింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. ఇందులో బ్రాంచీలు మారిన వారికీ బోధనా రుసుములు పొందేందుకు అర్హత ఉంటుంది.

స్లైడింగ్‌ తర్వాత సీట్లు రద్దు చేసుకుంటే వాటిని స్పాట్‌ ప్రవేశాల్లో చేర్చరు. వాటిని ఆ తర్వాత సంవత్సరం లేటరల్‌ ఎంట్రీ కోసం నిర్వహించే ఎల్‌పీసెట్‌లో ఉత్తీర్ణులైన వారితో భర్తీ చేస్తారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.