• facebook
  • whatsapp
  • telegram

SBI Clerk Admitcard: ఎస్‌బీఐ క్లర్క్‌ మెయిన్స్‌ అడ్మిట్‌ కార్డులు

* జూన్‌ 9వ తేదీన పరీక్ష

* మొత్తం 8,773 ఖాళీల భర్తీ
 


ఈనాడు ప్రతిభ డెస్క్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) జూనియర్‌ అసోసియేట్(క్లర్క్‌) ప్రధాన పరీక్ష (Mains) అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జూన్‌ 9వ తేదీన మెయిన్స్‌ నిర్వహించనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా 8,773 జూనియర్‌ అసోసియేట్స్‌(క్లరికల్‌ కేడర్‌) పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 525; అమరావతి సర్కిల్‌లో 50 ఖాళీలున్నాయి. ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. 
 

  ఎస్‌బీఐ క్లర్క్‌ మెయిన్స్‌ అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి  




  SBI Clerks Mains Study Material   
 

♦ Reasoning and Computer Aptitude
♦ Quantitative Aptitude
♦ English Language


 ♦ Previous papers  


♦  Model Papers  




 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.