• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆడుకుంటూ... నేర్చుకుంటూ!

గేమిఫికేషన్‌ మెథడ్‌లో ప్రిపరేషన్‌

ఎప్పుడూ పుస్తకం పట్టుకుని కూర్చోవడం కాదు... సరదాగా, వినూత్నంగా నేర్చుకోవడంలో భాగంగా కొత్తకొత్త టెక్నిక్స్‌ తెరపైకి వస్తున్నాయి. అటువంటిదే ‘గేమిఫికేషన్‌’ మెథడ్‌ - అంటే పాఠాలను ఆటల్లో కలిపి నేర్చుకునేలా చేయడం. అసలు మనం వీడియోగేములకు ఎందుకు అతుక్కుపోతామో తెలుసా? ఆ ఆటల్లో ఇచ్చే టార్గెట్లను పూర్తిచేయడం, కొత్త స్కోర్లను అందుకోవడం లాంటి వాటి వల్ల మెదడులో ఎండార్ఫిన్, డోపమైన్‌ లాంటి సంతోషాన్నిచ్చే హార్మోన్లు విడుదలవుతాయి. అందుకే వాటిని మనం ఆడకుండా ఉండలేం, అలవాటు పడిపోతాం. చదువును కూడా అలా అలవాటు చేయడమే గేమిఫికేషన్‌ పద్ధతి. చాలా సబ్జెక్టులకు ఇలాంటి గేములు దొరుకుతున్నాయి. సరదాగా నేర్చుకోవడంతోపాటు సులువుగా గుర్తుండేలా చేసే ఈ ఆటలను తోటి విద్యార్థులతో కలిసి ఆడితే అటు ఆసక్తీ పెరుగుతుంది, ఇటు మార్కులూ పెరుగుతాయి.

‘మీరు ఈ టాపిక్‌ చదివితే పాయింట్లు లభిస్తాయి... ఈ ప్రశ్నకు జవాబిస్తే అత్యధిక స్కోరు మీదే’ ఇలాంటివి వింటే ఎవరికి మాత్రం చదువుకోవాలని అనిపించదు చెప్పండి!
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నాయకత్వ లక్షణాలకు పదునుపెట్టేలా..

‣ మెటా.. ఇక దీనిదే ఆట

‣ గణిత బోధనలో ఘనమైన సంస్థ!

‣ బయో టెక్నాలజీలో పీజీ

‣ ఫీజులు తక్కువ నాణ్యత ఎక్కువ!

‣ టెన్త్‌తో సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగం

‣ నకిలీ ఉద్యోగ ప్రకటనలను గుర్తించడం ఎలా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-03-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌