• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ANGRAU: ఆచార్య ఎన్‌జీ రంగా వర్సిటీలో బీఎస్సీ, బీటెక్‌ ప్రోగ్రామ్ 

2024-25 విద్యా సంవత్సరానికి అండర్‌ గ్రాడ్యుయేట్‌ వ్యవసాయ బీఎస్సీ, అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలకు ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటన జారీ చేసింది. ఇంటర్‌లో బైపీసీ స్ట్రీమ్‌ కోర్సులు బీఎస్సీ (ఆనర్స్‌) వ్యవసాయం, బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ) కోర్సులకు ఈఏపీసెట్‌-2024లో అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులు. ఎంపీసీ స్ట్రీమ్‌ కోర్సులు బీటెక్‌ (వ్యవసాయ ఇంజినీరింగ్‌), బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ)ల్లో రైతు కోటాలో ప్రవేశాలకు ఈఏపీసెట్‌-2024లో ర్యాంకులు సాధించిన వారు అర్హులు. 

ప్రోగ్రామ్ వివరాలు:

1. బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్: 1,232 సీట్లు

2. బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ): 73 సీట్లు

అర్హత: ఇంటర్మీడియట్ (ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ లేదా నేచురల్ సైన్సెస్) ఉత్తీర్ణతతో పాటు ఏపీ ఈఏపీసెట్‌ 2024 ర్యాంకు సాధించి ఉండాలి.

వయోపరిమితి: 31 డిసెంబర్ 2024 నాటికి 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఏపీ ఈఏపీసెట్‌ 2024 ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

రిజిస్ట్రేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500.

ముఖ్య తేదీలు...

రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: 02/08/2024.

ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 12/08/2024.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter,Share chatGoogle News Subscribe our Youtube Channel.

Important Links

Posted Date: 20-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :