• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AGRICET: అగ్రిసెట్‌ అండ్‌ అగ్రి ఇంజినీరింగ్‌ సెట్‌ 2024 

హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం… 2024-25 విద్యా సంవత్సరానికి అగ్రిసెట్‌ అండ్‌ అగ్రి ఇంజినీరింగ్‌ సెట్‌ 2024 నోటిఫికేఫన్‌ను విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా అర్హులైన డిప్లొమా అభ్యర్థులు పీజేటీఎస్‌ అగ్రి వర్సిటీ పరిధిలో బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ డిగ్రీ ప్రోగ్రామ్‌, బీటెక్‌ (అగ్రి ఇంజినీరింగ్) డిగ్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు పొందవచ్చు. వ్యవసాయ సంబంధిత విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆగస్టు 9వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

సెట్‌ వివరాలు:

* అగ్రిసెట్-2024

అర్హత: డిప్లొమా (అగ్రికల్చర్/ సీడ్ టెక్నాలజీ/ ఆర్గానిక్ అగ్రికల్చర్/ ఆర్గానిక్ ఫార్మింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

మొత్తం సీట్లు: 92. ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 9, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటా కింద 34 సీట్లు కేటాయించారు.

* అగ్రి ఇంజినీరింగ్‌ సెట్‌ 2024

అర్హత: డిప్లొమా (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

మొత్తం సీట్లు: 8. ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 1, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటా కింద 1 సీటు కేటాయించారు.

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు రుసుము: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1400; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.700.

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09.08.2024.

ఆలస్య రుసుముతో దరఖాస్తు ప్రారంభం: 10.08.2024.

ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 12.08.2024.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 24.08.2024.

ప్రశ్నపత్రం, కీ అందుబాటులో ఉండే తేదీలు: 28.08.2024 నుంచి 29.08.2024 వరకు.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 21-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :