• facebook
  • whatsapp
  • telegram

నోట్సు రాయడం ఒక కళ

సాధారణంగా పరీక్షలకోసం చదవడంలో రెండు దశలుంటాయి. (అ) వివిధ వనరుల నుంచి మనకు కావాల్సిన సమాచారాన్ని సేకరించి దాన్ని మన మెదడులోకి చేర్చడం. (ఆ) అలా మెదడులోకి చేర్చిన సమాచారాన్ని పరీక్షకు కావాల్సిన రీతిలో ఆవిష్కరించడం. ఈ రెండింటికీ సంబంధించిన ముఖ్యమైన సాధనం నోట్సు. చదువుకోవడం ద్వారానూ, పాఠం వినడం ద్వారానూ మన మస్తిష్కంలో చేరిన సమాచారం అక్కడ స్థిరపడటానికి ఉపయోగపడే ప్రధానమైన పరికరం నోట్సు. మన మెదడులో ఉన్న జ్ఞానం అనే ఖజానాకు తాళం చెవి నోట్సు. పద్దు పుస్తకం నోట్సు.

నోట్స్ అనే అంగ్ల పదానికి తెలుగులో గమనించదగినది, గమనించాల్సినది అనే అర్థాలున్నాయి. మనం చదువుతున్న, వింటున్న విస్తారమైన సమాచారంలో శ్రద్ధగా గమనించాల్సిన అంశాలను లిఖితరూపంలో నమోదుచేసుకోవడాన్నే నోట్సు రాసుకోవడం అంటున్నాం. నోట్సు ఎందుకు రాయాలి. అనే ప్రశ్నకు సమాధానం దాని అర్థంలోనే ఉందన్నమాట.

మంచి నోట్సు (అ) పాఠ్యాంశం సారాంశాన్ని సంక్షిప్తంగా అందిస్తుంది, (ఆ) ముఖ్యమైన సమాచారాన్ని ఎత్తిచూపుతుంది (ఇ) సులభంగా ఆ సమాచారాన్నంటినీ మళ్లీ గుర్తుచేసుకొనే అవకాశం కల్పిస్తుంది.

వాస్తవానికి మనం సొంతంగా రాసుకున్నదాన్నే నోట్సు అనాలి. ప్రస్తుతం విద్యార్హతల కోసం నిర్వహిస్తున్న సాధారణ పరీక్షలకు డిగ్రీ, పీజీ స్థాయి వరకూ ప్రశ్నా జవాబు రూపంలో ఉన్న రెడీమేడ్ నోట్సులు గైడ్లు, క్వశ్చన్ బ్యాంకుల రూపంలో లభిస్తున్నాయి. కాబట్టి క్లాసులో పాఠం వింటూ నోట్సు రాసుకోవాల్సిన అవసరం విద్యార్థులకు తప్పిపోయింది. కానీ, అలా రెడీమేడ్‌గా దొరుకుతున్నవి సంక్షిప్తీకరించిన టెక్ట్స్ బుక్స్ మాత్రమే. ఇలా రెడీమేడ్ నోట్సులు అందుబాటులో ఉండటం కింది తరగతుల్లో వరంగా కనబడుతున్నా, దీని ప్రభావం పై తరగతుల్లో శాపంగా మారుతోంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నత చదువులు చదివేటప్పుడు, మనదేశంలోనే సివిల్స్ లాంటి ఉన్నతోద్యోగాలిచ్చే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేటప్పుడు స్వంతంగా నోట్సు రాసుకోవడం రాకపోవడమనేది విజయానికి పెద్ద అవరోధంగా మారుతోంది.

Posted Date: 11-09-2020


 

నోట్సు రాయడం ఎలా?

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం