• facebook
  • whatsapp
  • telegram

ఐవీ లీగ్ అంటే ఏమిటి?

విదేశీ విద్య‌కు ప్ర‌సిద్ధ సంస్థ‌లు

అమెరికాలో చదవాలి అనుకునే వారు... ఐవీ లీగ్‌ అనే మాటను తప్పకుండా వినే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు చదవాలనుకునే ఈ విశ్వవిద్యాలయాల గురించి మీకు తెలుసా?

యూఎస్‌ఏలో ఉన్న 6000కు పైగా కాలేజీలు, యూనివర్సిటీల్లోకెల్లా ఈ ఐవీ వర్సిటీలు పేరెన్నికగలవి. హార్వర్డ్, ప్రిన్స్‌టన్, డార్‌మౌత్, కొలంబియా, బ్రౌన్, యేల్, కార్నెల్, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా సంస్థలు ఈ లీగ్‌లో ఉన్న ఎనిమిది యూనివర్సిటీలు. మొట్టమొదటసారిగా 1933లో వీటన్నింటినీ ఐవీ లీగ్‌ వర్సిటీలుగా క్రీడల సందర్భంలో పిలవడం ప్రారంభించారు. అప్పటినుంచీ అది అలాగే కొనసాగుతోంది. కానీ ప్రస్తుతం అకడమిక్‌ కోణంలోనే ఈ మాటను ఉపయోగిస్తున్నారు.


 వీటిలో చదివినవారిలో ఎంతోమంది నోబెల్‌ బహుమతి విజేతలు, శాస్త్రవేత్తలు, దిగ్గజ కంపెనీల సీఈవోలు, రాజకీయనాయకులు ఉన్నారు. ఏటా వీటికి వచ్చే దరఖాస్తుల్లో 3.9 నుంచి 8.7 మంది అభ్యర్థులనే కోర్సుల్లోకి తీసుకుంటున్నారంటే అర్థమవుతోంది కదా... పోటీ ఏ స్థాయిలో ఉంటుందో! అందుకే వీటిల్లో చేరదలచిన విద్యార్థులు చాలా ముందు నుంచీ ప్రణాళిక వేసుకోవాలి. 


 ఈ వర్సిటీలు బిజినెస్, కంప్యూటర్‌ సైన్స్, సోషల్‌ సైన్స్, ఇంజినీరింగ్‌ వంటి విభాగాల్లో వందలాది కోర్సులను అందిస్తున్నాయి. ఉత్తమ విద్యార్థులను మాత్రమే తమ సంస్థల్లోకి ఆహ్వానించేలా కఠినమైన విధానాలు రూపొందించుకున్నాయి. అందువల్ల వీటిలో ప్రవేశం కోరుకునేవారు అండర్‌ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్‌ స్థాయుల్లో టాప్‌ మార్కులు సాధించడం తప్పనిసరి. అకడమిక్‌ స్కోరు, ప్రవేశ పరీక్షల మార్కులే కాకుండా విద్యేతర నైపుణ్యాలు, కార్యక్రమాలనూ ఈ సంస్థలు పరిగణనలోకి తీసుకుంటాయి. చదువుతోపాటు ప్రత్యేక రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వీటిలో ప్రవేశం దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


  విద్యార్థులు ఈ వర్సిటీలకు అప్లై చేసేటప్పుడు దరఖాస్తుతోపాటు ఎస్‌వోపీ (స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌),  ఎల్‌వోఆర్‌ (లెటర్‌ ఆఫ్‌ రికమెండేషన్‌)లను ఆకట్టుకునే విధంగా మలచడం చాలా అవసరం. ఒక్కసారి వీటిలో ప్రవేశం లభిస్తే ఇక సెటిలైపోయినట్లే అని భావిస్తారు. అయితే ఉత్తమమైన విద్యా బోధన అందించే ఈ వర్సిటీల్లో చదవడం కూడా అంతే ఖరీదైనది. ఫీజు  ఎక్కువగా ఉంటుంది. పీజీ స్థాయిలో చదివేందుకు మన దగ్గర నుంచి విద్యార్థులు అధికంగా వెళ్తుంటారు. 


  వీటికి దరఖాస్తు చేసేందుకు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, ఏదైనా ఆంగ్ల భాషా ప్రావీణ్య పరీక్షలో ఉత్తీర్ణత, జీమ్యాట్‌ - జీఆర్‌ఈ - ఎల్‌శాట్‌ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణత అవసరం అవుతాయి. సాధారణంగా ఇవి ఏటా నవంబర్, డిసెంబర్‌ నెలల్లో దరఖాస్తులు ఆహ్వానిస్తుంటాయి.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఏ ప్ర‌శ్న‌కు ఏం చెప్పాలి?

‣ కేంద్రీయ విద్యాల‌యాల్లో ఉద్యోగాలు

‣ కచ్చితంగా నేర్చుకోండి లీన్‌ 6 సిగ్మా

‣ టాప్‌ 5 ఉద్యోగాలు ఇవే!

‣ ఇంటర్మీడియట్‌తో ఇవిగో ఉద్యోగాలు

‣ ఏపీ పోలీస్‌ కొలువుకు సిద్ధ‌మేనా?

‣ పోలీస్ ఉద్యోగాల మొయిన్స్‌లో మెర‌వాలంటే?

Posted Date : 16-12-2022


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం