• facebook
  • whatsapp
  • telegram

Admissions: ‘గీతం’ దూర విద్యా కోర్సుల్లో ప్రవేశాలు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: ఇంటి వద్దే ఉంటూ ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి, ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ చదువు కొనసాగించాలనుకునేవారికి నామమాత్రపు రుసుంతో గీతం డీమ్డ్‌ వర్సిటీ సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌(సీడీఎల్‌) ద్వారా వివిధ డిగ్రీ, పీజీ కోర్సులు అందుబాటులోకి తెస్తున్నట్లు సీడీఎల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.శ్రీనివాస్‌ మార్చి 19న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మొదటి దశలో బీఏ, బీకామ్‌ డిగ్రీ కోర్సులతో పాటు ఎంఏ ఆంగ్లంలో పీజీ కోర్సుకు గాను ఈ ఏడాది ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) గుర్తింపుతో నిర్వహిస్తున్న ఈ కోర్సుల్లో చేరేవారికి ఆన్‌లైన్‌ ద్వారా స్టడీ మెటీరియల్‌ అందజేస్తామన్నారు. ఆసక్తి గలవారు పూర్తి వివరాలకు గీతం సీడీఎల్‌  మరింత సమాచారం కోసం దొండపర్తి (విశాఖ నగరం)లోని గీతం సీడీఎల్‌ కేంద్రాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు.  


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియ‌న్ కావ‌చ్చు !

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.