• facebook
  • whatsapp
  • telegram

DSC : డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

* స్థానికతకు 1-7 తరగతులే ప్రామాణికం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి చేపట్టిన డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మార్చి4న రాత్రి 12 గంటల తర్వాత ప్రారంభమైంది. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే.  ఏప్రిల్‌ 3 వరకు https://schooledu.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయాన్ని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా జిల్లాల వారీగా ఏ సబ్జెక్టుకు ఎన్ని ఖాళీలు, వాటికి సంబంధించిన రోస్టర్‌ను విడుదల చేసింది. సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ)ల తేదీలను ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. అభ్యర్థుల స్థానికతను నిర్ధారించేందుకు గతంలో 4-10 తరగతులను పరిగణనలోకి తీసుకోగా, తాజాగా 1-7 తరగతులను లెక్కలోకి తీసుకుంటారు.

* గత ఏడాది డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయనవసరం లేదు.

* సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ) పోస్టులకు కేవలం డీఎడ్‌ పూర్తి చేసిన వారే అర్హులు. బీఎడ్‌ వారు పోటీపడే అవకాశంలేదు.

* స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ) ఉద్యోగాలకు సంబంధిత విధానంలో బీఎడ్‌ పూర్తి చేసిన వారు అర్హులు. నాలుగేళ్ల బీఎడ్‌ పూర్తి చేసిన వారూ పోటీపడొచ్చు.

* ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు యూజీ డీపీఈడీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ పూర్తిచేసినవారు.. బీపీఈడీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.

* బీఎడ్‌, డీఎడ్‌ చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్‌ పరీక్షలు రాసినవారు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు. వారికి డీఎస్సీ వెరిఫికేషన్‌ నాటికి ధ్రువీకరణపత్రాలు ఉండాలి.

* అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితికి కటాఫ్‌ తేదీగా 1-7-23ను నిర్ణయించారు. ఈ తేదీలోగా 46 సంవత్సరాలు గలవారై ఉండాలి. కనిష్ఠ వయోపరిమితి 18 ఏళ్లు. ప్రభుత్వ ఉద్యోగులకు 5, మాజీ సైనికులకు 3, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వారికి 5, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది.

* తెలంగాణ, ఏపీ టెట్‌, లేదా సెంట్రల్‌టెట్‌(సీ టెట్‌)లో క్వాలిఫై అయి ఉండాలి.

* గతంలో ఏజెన్సీ పోస్టుల్లో 100 శాతం గిరిజనులకే కేటాయించగా, ఈ నిబంధనను తాజాగా ఎత్తివేశారు. అంతా పోటీపడొచ్చు.

* ఎస్టీ రిజర్వేషన్‌ గతంలో 6 శాతం ఉండగా, పెంచిన 10 శాతాన్నే వర్తింపజేస్తారు.

* ఇంటర్‌లో మార్కుల శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 శాతానికి సడలింపు

* గతంలో లోకల్‌, ఓపెన్‌కోటా రిజర్వేషన్‌ 80:20 పద్ధతిలో ఉండగా, తాజాగా 95:5 రేషియోను అమలు చేస్తారు.

* జీవో-3 ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలుచేస్తారు. మూడు పోస్టులుంటే ఒకటి మహిళతో భర్తీ చేస్తారు.


 

  టీఆర్‌టీ/డీఎస్సీ తెలంగాణ   


 

  స్కూల్ అసిస్టెంట్   

తెలుగు (కంటెంట్)

గణితం (కంటెంట్)

సోషల్ స్టడీస్ (కంటెంట్)


  సెకండరీ గ్రేడ్ టీచర్స్  

సైకాలజీ (కంటెంట్)

గణితం (కంటెంట్)

సైన్స్ (కంటెంట్)


  తెలుగు పండిట్  

కంటెంట్

మెథడాలజీ


  బిట్ బ్యాంక్  

ఫిజికల్ సైన్సెస్ (కంటెంట్)

బయాలజీ (కంటెంట్)
 

  పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు


  మరిన్ని వాటి కోసం క్లిక్ చేయండి   

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!

‣ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)

‣ గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ ప్లాన్‌ (టీఎస్‌పీఎస్సీ)

‣ ‘ట్రిపుల్‌ ఆర్‌’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!

‣ సివిల్స్‌ సన్నద్ధత!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.