విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Education: బీటెక్‌లో 80 శాతం మందికి బోధనా రుసుములు


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కన్వీనర్‌ కోటా కింద బీటెక్‌ సీట్లు పొందిన విద్యార్థుల్లో 80.33 శాతం మంది బోధనా రుసుములు పొందనున్నారు. మొత్తం 75,200 మంది ఇటీవల సీట్లు పొందారు. వారిలో 60,411 మంది పాక్షికంగా లేదా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులని అధికారులు తేల్చారు. అందుకు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వార్షిక కుటుంబ ఆదాయం రూ.లక్షన్నర, పట్టణ/నగర ప్రాంతాల్లోని వారికి రూ.2 లక్షల లోపు ఆదాయం ఉండాలి. ఎప్‌సెట్‌ ర్యాంకు 10 వేల లోపు ఉన్న ఓసీ, బీసీలకు (కుటుంబ ఆదాయ పరిమితి తప్పనిసరి) పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తారు. ఆ పై ర్యాంకు ఉంటే రూ.35 వేలు మాత్రమే ఇస్తారు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం పూర్తి బోధనారుసుం పొందేందుకు ర్యాంకు పరిమితి నిబంధన వర్తించదు.


ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వారు 11,211 మంది బీటెక్‌ సీట్లు పొందిన మొత్తం విద్యార్థుల్లో.. 11,211 మంది ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వారున్నారు. వీరికి ర్యాంకు పరిమితితో సంబంధం లేకుండా 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లభిస్తుంది.


మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Published at : 25-07-2024 12:47:56

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం