ఈనాడు, హైదరాబాద్: మార్చి 4న ఇక్కడ ఎల్బీస్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 5,278 మంది డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, పోలీసు, మెడికల్ సిబ్బందిగా ఎంపికైన వారికి సీఎం నియామక పత్రాలను అందజేశారు. ఉద్యోగాలు, భవిష్యత్తు కోసం ఇంగ్లిష్ అవసరం. ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే ఆంగ్లాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరూ నేర్చుకోవాలి. ఆ భాషరాదని అవహేళన చేసే పరిస్థితి రావద్దు. 3 నెలల్లో 30 వేల ఉద్యోగాలిచ్చాం. ఉద్యోగాలు పొందిన నిరుద్యోగ యువత కళ్లలో ఆనందం చూడాలి. మీ సంతోషంలో రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలు భాగస్వామ్యం కావాలి. నిరుద్యోగులకు స్ఫూర్తిగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా. ఇప్పటికే 563 పోస్టులతో గ్రూప్-1, 11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటనలు జారీచేశాం. మార్చి 4న ఒక్కరోజే 6,549 మందికి నియామకపత్రాలు ఇవ్వాలని భావించినా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా అందరికీ ఇవ్వలేకపోయాం. కోడ్ ముగిసిన తరువాత మిగిలినవారికి అందిస్తాం.
* మోడల్ గురుకుల విద్యను అందుబాటులోకి తెస్తాం
‘‘భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నా. మీరంతా ఉపాధ్యాయ వృత్తిని ప్రజాస్వామ్య, సామాజిక బాధ్యతగా నిర్వహించాలి. డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, నాయకులు, పాలకులను తయారు చేసే బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా డ్రగ్స్ రాజ్యమేలుతున్నాయి. ఉపాధ్యాయులు భవిష్యత్తు తరాలకు విలువలతో కూడిన జీవితం, సామాజిక బాధ్యత నేర్పించాలి. పిల్లలకు గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్‌పై అవగాహన కల్పించాలి. గురుకులాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు మోడల్ గురుకుల విధానం తీసుకువస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద 25 ఎకరాల్లో రూ.150 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను ఒకే ప్రాంగణంలో నిర్మిస్తాం. మిగిలిన నియోజకవర్గాల్లో అవకాశమున్నచోట ఆదర్శ క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తాం. గత పదేళ్లలో ఒకే డీఎస్సీ వేయగా.. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014వరకు 4 డీఎస్సీలు వేసి లక్ష మంది టీచర్లను నియమించింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లో పోలీసు, పారామెడికల్, సింగరేణి, టీచర్ ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేశాం’’ అని సీఎం తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!
‣ గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)
‣ గ్రూప్-1 ప్రిపరేషన్ ప్లాన్ (టీఎస్పీఎస్సీ)
‣ ‘ట్రిపుల్ ఆర్’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!
‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.