విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

UPSC: గత ఐదేళ్లలో.. యూపీఎస్సీ సర్వీసుల్లో 1,195 మంది రిజర్వుడు కేటగిరీ అభ్యర్థుల నియామకం  


దిల్లీ: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ద్వారా గత అయిదేళ్లలో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులకు చెందిన 1,195 మంది అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులుగా నియమితులయ్యారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ బుధవారం ఈ విషయాన్ని లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఆయా వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేస్తూ ఈ నియామకాలు జరిగాయని మంత్రి వివరించారు.


బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ఆదేశం
 

కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో భర్తీ కాకుండా ఖాళీగా ఉన్న (బ్యాక్‌లాగ్‌) రిజర్వుడు కేటగిరీ పోస్టులను గుర్తించటానికి అంతర్గత కమిటీలను నియమించుకోవాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఖాళీలను గుర్తించడంతో పాటు వాటి భర్తీకి ప్రత్యేక నియామక ప్రక్రియను చేపట్టాలని కూడా ఆ ఆదేశాల్లో పేర్కొన్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు.
 




 

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Updated at : 25-07-2024 12:16:07

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం