• facebook
  • whatsapp
  • telegram

Admissions: 1 నుంచి బాసర ఆర్‌జీయూకేటీ ప్రవేశాలు

* దరఖాస్తుకు తుది గడువు జూన్‌ 26

ఈనాడు, హైదరాబాద్‌: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (బాసర)లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 1 నుంచి 26 వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు, వర్సిటీ ఉపకులపతి ఆచార్య వి.వెంకటరమణ మే 27న  హైదరాబాద్‌లో వివరాలు వెల్లడించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా 1,500 సీట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అందులో 15 శాతం సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడవచ్చని పేర్కొన్నారు. ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా బీటెక్‌లో వివిధ బ్రాంచీల్లోని సీట్లను భర్తీ చేస్తామన్నారు. తొలి ఏడాదికి ఫీజు రూ.37 వేలు ఉండగా..రీయింబర్స్‌మెంట్‌ అర్హత ఉన్న వారు ఆ రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. దానికితోడు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.వెయ్యి, కాషన్‌ డిపాజిట్‌ రూ.2 వేలు, ఆరోగ్య బీమా కింద రూ.700 మొత్తం రూ.3,700 అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.

ప్రవేశాల కాలపట్టిక...

దరఖాస్తుల సమర్పణ: జూన్‌ 1 నుంచి 26 సాయంత్రం 5 గంటల వరకు

సీట్ల కేటాయింపు: జులై 3న

ధ్రువపత్రాల పరిశీలన: జులై 8 నుంచి 10 వరకు

ముఖ్యాంశాలు

*  ఈ సంవత్సరం తొలి ప్రయత్నంలో పదో తరగతి పాసైన వారే అర్హులు. వారి వయసు జూన్‌ 1వ తేదీ నాటికి 18 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 21 సంవత్సరాల వరకు      మినహాయింపు ఉంది.

* గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు 5 శాతం సీట్లు సూపర్‌న్యూమరీ కింద కేటాయిస్తారు. పూర్తి వివరాలను ఆర్‌జీయూకేటీ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!

Published Date : 28-05-2024 11:13:38

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం