‣ జిల్లాల వారీగా ఖాళీల వివరాలివే..
‣ మొత్తం 16,347 టీచర్ల భర్తీ
మెగా డీఎస్సీతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించని వారు, ఈ ప్రకటన తర్వాత బీఈడీ, డీఈడీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. టెట్, మెగా డీఎస్సీకి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొదట టెట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత డీఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు 30 రోజులు సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం డీఎస్సీ పరీక్ష ఉంటుంది. జూన్ 30 లేదా జులై 1న మెగా డీఎస్సీ, టెట్‌కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను రద్దు చేసి, కొత్తగా 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ ప్రకటన ఇస్తారు. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏటా డీఎస్సీ
ప్రతి ఏడాదీ డీఎస్సీ నిర్వహించే అంశంపైనా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఏ విద్యా సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఖాళీలు, అవసరం మేరకు డీఎస్సీ నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు... | |
జిల్లా | ఖాళీలు |
శ్రీకాకుళం | 543 |
విజయనగరం | 583 |
విశాఖపట్నం | 1134 |
తూర్పు గోదావరి | 1346 |
పశ్చిమ గోదావరి | 1067 |
కృష్ణా | 1213 |
గుంటూరు | 1159 |
ప్రకాశం | 672 |
నెల్లూరు | 673 |
చిత్తూరు | 1478 |
కడప | 709 |
అనంతపురం | 811 |
కర్నూలు | 2678 |
డీఎస్సీ ఆంధ్రప్రదేశ్
స్కూల్ అసిస్టెంట్
తెలుగు (కంటెంట్) |
హిందీ (కంటెంట్) |
ఇంగ్లిష్ (కంటెంట్) |
బయాలజీ (కంటెంట్) |
ఫిజికల్ సైన్సెస్ (కంటెంట్) |
సోషల్ స్టడీస్ (కంటెంట్) |
విద్యా దృక్పథాలు (కంటెంట్) |
సైకాలజీ (కంటెంట్) |
తెలుగు పండిట్
కంటెంట్ |
మెథడాలజీ |
సెకండరీ గ్రేడ్ టీచర్స్
లాంగ్వేజ్ - I తెలుగు (కంటెంట్) |
గణితం (మెథడాలజీ) |
సోషల్ స్టడీస్ (కంటెంట్) |
సైన్స్ (కంటెంట్) |
విద్యా దృక్పథాలు |
సైకాలజీ (కంటెంట్) |
లాంగ్వేజ్ - I హిందీ (కంటెంట్) |
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.