1. టీ20 ప్రపంచకప్ టీమ్ఇండియాదే!
భారత్ మళ్లీ విశ్వవిజేతగా నిలిచింది. 2007లో టీ20 ప్రపంచకప్ మొదలైనపుడు ఆ టైటిల్‌ను సొంతం చేసుకున్న భారత్ మధ్యలో ఏడు కప్పుల విరామం తర్వాత మళ్లీ విజేతగా నిలిచింది. 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మొదట టీమ్ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. సీబీడీటీ ఛైర్మన్‌గా రవి అగర్వాల్
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కు కొత్త ఛైర్మన్‌గా రవి అగర్వాల్ నియమితులయ్యారు. ఈయన 1988 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. 2025 జూన్ వరకు రవి అగర్వాల్ సీబీడీటీ ఛైర్మన్‌గా కొనసాగుతారని నియామకాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గ కమిటీ జారీ చేసిన ఆదేశాల ఆధారంగా తెలుస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. దేశీయ వస్తు, సేవల ఎగుమతులు రూ.66 లక్షల కోట్లు!
అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) దేశీయ వస్తు, సేవల ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను (సుమారు రూ.66 లక్షల కోట్లు) అధిగమించే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2023-24లో దేశీయ ఎగుమతులు 778.2 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.64.50 లక్షల కోట్లు) నమోదయ్యాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. డీఓపీటీ కార్యదర్శిగా అజయ్ భల్లాకు అదనపు బాధ్యతలు
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లాకు సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ (డీఓపీటీ) కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ శాఖ కార్యదర్శిగా ఉన్న రాధాచౌహాన్ పదవీ విరమణ చేస్తుండటంతో అజయ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. కొత్త క్రిమినల్ చట్టాలపై ‘సమాహార’ యాప్
కొత్త క్రిమినల్ చట్టాల వివరాలతో కూడిన హ్యాండ్బుక్తోపాటు మొబైల్ అప్లికేషన్ (యాప్) ‘సమాహార’ను తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి డా.జితేందర్ ఆవిష్కరించారు. జులై 1 నుంచి అమల్లోకి రానున్న ఈ చట్టాల సమగ్ర వివరాలతో ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ వీటిని రూపొందించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.