* షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణ
ఈనాడు, హైదరాబాద్: డీఎస్సీ హాల్టికెట్లు ఈనెల 11వ తేదీ సాయంత్రం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, వాటిని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి సోమవారం తెలిపారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని ఇటీవలే విద్యాశాఖ పూర్తిస్థాయి షెడ్యూల్ను ప్రకటించింది. పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయం చాలా తక్కువ ఇచ్చారని, దానికితోడు గ్రూపు-2 పరీక్షలు ఉన్నందున కనీసం నెలపాటు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే హాల్టికెట్లను www.schooledu.telangana.gov.in అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ప్రకటించడంతో పరీక్షల వాయిదా ఉండదని స్పష్టం చేసినట్లయ్యింది. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీలకు డీఎస్సీ నిర్వహిస్తున్నారు.
టీఆర్టీ/డీఎస్సీ తెలంగాణ
సైన్స్ (కంటెంట్)
తెలుగు పండిట్
పాత ప్రశ్నపత్రాలు
నమూనా ప్రశ్నపత్రాలు
మరింత సమాచారం... మీ కోసం!
‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు!
‣ హెచ్సీఎల్లో జూనియర్ మేనేజర్లు!
‣ క్లర్క్ కొలువు సాధనతో సులువు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.