• facebook
  • whatsapp
  • telegram

Eduaction: కొత్త కోర్సుల బీటెక్‌

ఈనాడు, కరీంనగర్‌: సంప్రదాయ కోర్సులకు కాలం చెల్లింది.. బీటెక్‌లో కొత్త కోర్సుల హవా కొనసాగుతోంది. గడిచిన కొన్నేళ్లుగా ఇంజినీరింగ్‌ విద్య కొత్త పుంతలు తొక్కుతోంది. సమకాలీన అంశాలతో ముడిపడి.. ఉద్యోగావకాశాల డిమాండ్‌ ఉన్న వాటివైపే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. చదువరుల ఆసక్తికి అనుగుణంగానే కళాశాలల్లోనూ సమున్నత అవకాశాలు వచ్చి చేరుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 3, ప్రైవేటువి 9.. మొత్తం కలిపి 12 ఇంజినీరింగ్‌ కళాశాలలు మాత్రమే ఉన్నాయి. గత విద్యా సంవత్సరం సుమారు 10వేలకుపైగా విద్యార్థులు వీటిలో చదువుతున్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరంలో 18,125 మంది ఉత్తీర్ణత సాధించగా అందులో టీజీ ఎప్‌సెట్‌ (ఎంసెట్‌)ను 6వేల మంది రాశారు. 

వీటికి ఆదరణ!

సాధారణ ఇంజినీరింగ్‌ కోర్సులకు యువత స్వస్తి పలుకుతున్నారు. సివిల్, మెకానికల్, ఐటీ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో గతంలో మాదిరిగా ఎక్కువ మంది చేరడం లేదు. దీంతో ఎక్కువగా వేటికి డిమాండ్‌ ఉన్నవని గుర్తించి కళాశాలలు కూడా వాటిని అందుబాటులోకి తెస్తున్నాయి. ముఖ్యంగా సిరిసిల్లలో నేత కార్మికులకు ఉన్న అవకాశాల నేపథ్యంలో అక్కడి జేఎన్టీయూలో టెక్స్‌టైల్స్‌ ఇంజినీరింగ్‌ కోర్సు ప్రవేశ పెట్టారు. గోదావరిఖని, రామగుండం సింగరేణి ప్రాంతమవడంతో ఇక్కడి ప్రాంతం వారికి అవకాశాలు లభించాలనే ఉద్దేశంతో మైనింగ్‌ ఇంజినీరింగ్‌ కోర్సు మంథని జేఎన్టీయూలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడంతా ఏఐ ట్రెండ్‌కు ప్రాధాన్యం ఉండటంతో ప్రైవేటు కళాశాలలు ఆ కోర్సులపై దృష్టి పెట్టాయి. ఏఐఎం (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌) రూపంలో కొన్ని సీట్లున్నాయి. సీఎస్‌ఈ కోర్సుకు అదనంగా కంప్యూటర్‌ ఆధారితంగా ఇంకొన్ని అదనపు కోర్సులను ప్రవేశ పెట్టారు. సీఎస్‌జీ (కంప్యూటర్‌ సైన్స్‌ ఆండ్‌ డిజైన్‌),  సీఎస్‌ఎం (కంప్యూటర్‌ సైన్స్‌ ఆండ్‌ ఇంజినీరింగ్‌- ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ మిషన్‌ లర్నింగ్‌), సీఎస్‌డీ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (డాటాసైన్స్‌), సీఎస్‌ఐ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)లు సీఎస్‌ఈ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) కోర్సుతో పోటీ పడబోతున్నాయి. ఇక ఎప్పటి మాదిరిగానే ఈసీఈ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్, ఈఈఈ (ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌), సివిల్‌ ఇంజినీరింగ్, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులలో సీట్లున్నాయి.

కన్వీనర్‌ కోటా సీట్లు.. 3,624  

సోమవారం నుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ మొదలవడంతో ఉమ్మడి జిల్లా విద్యార్థులు హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న కళాశాలలతోపాటు స్థానికంగా ఇక్కడ ఉన్న కళాశాలల్లో కోర్సులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. కొడిమ్యాల, మంథని, అగ్రహారంలో ఉన్న జేఎన్టీయూ ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో మొత్తం సీట్లు కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేయనున్నారు. ఇవి కాకుండా మిగతా ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఉన్నతాధికారులు విడుదల చేశారు. మొత్తంగా ప్రస్తుత కౌన్సెలింగ్‌లో ఉమ్మడి జిల్లాలోని అన్ని కళాశాలల్లో కలిపి 3,624 కన్వీనర్‌ కోటాలో సీట్లున్నాయి. ఇవి నిండిన తరువాత మరో 1,116 సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటాలో కళాశాల యాజమాన్యాలు భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ గత రెండు, మూడేళ్లుగా కన్వీనర్‌ కోటా సీట్లు ఉమ్మడి జిల్లాలో పూర్తి స్థాయిలో నిండటం లేదు. దీంతో పాత కోర్సులను వదిలి కొత్త వాటిని ప్రవేశ పెడుతూ సీట్లు నింపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. గతేడాది దాదాపుగా 5వేలకుపైగా సీట్లుంటే ఇప్పుడు తగ్గిన కోర్సుల ఆధారంగా సీట్ల సంఖ్య కూడా తగ్గింది. 

కళాశాలలు

జిల్లా    సంఖ్య

కరీంనగర్‌    7

జగిత్యాల    1

పెద్దపల్లి    3

సిరిసిల్ల    1

కోర్సు -  సీట్లు

సివిల్‌ - 225

సీఎస్‌డీ - 84

సీఎస్‌ఈ - 978

సీఎస్‌ఎం - 438

సీఎస్‌జీ - 42

సీఎస్‌ఐ - 21

ఈఈఈ - 516

ఈసీఈ - 645

మెకానిక్‌  - 285

ఏఐఎం - 168

ఐఎన్‌ఎఫ్‌  - 102

మైనింగ్‌ - 60

టెక్స్‌టైల్స్‌ - 60 



మరింత సమాచారం... మీ కోసం!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు!

‣ ప్రయత్నాలను మధ్యలో ఆపేయొద్దు! !

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.