సారంగాపూర్, న్యూస్టుడే: తొలి ప్రయత్నంతో పాటు పిన్న వయసులోనే సీఏ పూర్తి చేశాడు ఈ యువకుడు. బీర్పూర్ మండలంలోని నర్సింహులపల్లెకు చెందిన అడ్డగట్ల రోహిత్.. 23 ఏళ్లకే జనవరి9 విడుదలైన సీఏ ఫైనల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఇంటర్లో 980 మార్కులు సాధించి, 2018లో సీఏ ఫౌండేషన్లో చేరి, అదే ఏడాది ఒకే ప్రయత్నంలో పూర్తి చేసి ఔరా అనిపించాడు. 2019లో ఒకేసారి రెండు గ్రూపులు పూర్తి చేసి 2020 నుంచి 2023 వరకు సీఏ ఆర్టీకల్షిప్ పూర్తయిన తరువాత నవంబర్లో నిర్వహించిన సీఏ ఫైనల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. గ్రామీణ ప్రాంతం నుంచి చిన్న వయస్సులోనే సీఏ పూర్తి చేయడంతో స్నేహితులు, బంధువులు అభినందించారు. ప్రస్తుతం బహుళజాతి కంపెనీలో కొంత కాలం ఉద్యోగం చేసి, ఆడిట్ సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నానని రోహిత్ పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!
‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ
‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?
‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.