• facebook
  • whatsapp
  • telegram

SCPCR: ఎస్‌సీపీసీఆర్‌ పదవులకు దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(ఎస్‌సీపీసీఆర్‌)లో ఛైర్‌పర్సన్‌, ఆరుగురు సభ్యుల పదవుల భర్తీ కోసం మహిళా శిశు సంక్షేమశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హులైనవారు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 12 వరకు మహిళా శిశు సంక్షేమశాఖ వెబ్‌సైట్‌ http://wdcw.tg.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ తెలిపారు. ఆరుగురు సభ్యుల్లో తప్పనిసరిగా ఇద్దరు మహిళా సభ్యులు ఉంటారని పేర్కొన్నారు. దరఖాస్తులు పరిశీలించి అర్హులైనవారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, ఆన్‌లైన్‌ మినహా ఇతరత్రా మార్గాల ద్వారా వచ్చే దరఖాస్తులు పరిశీలించబోమని స్పష్టం చేశారు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.