• facebook
  • whatsapp
  • telegram

 Inter exams: ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు

* ఉన్నతాధికారులతో సీఎస్‌ సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌:  ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకూ జరగనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు. ఇంటర్మీడియట్‌, పదో తరగతి పరీక్షల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో  ఫిబ్రవరి 21న సీఎస్‌ టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ.. ‘‘ఇంటర్‌  మొదటి, రెండో సంవత్సరాల విద్యార్థులు మొత్తం 9.80 లక్షల మంది పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఉన్నతాధికారి సహా ఏ ఉద్యోగీ సెల్‌ఫోన్‌లను తీసుకెళ్లకూడదు. ప్రశ్నపత్రాలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు లేదా మూల్యాంకన కేంద్రాలకు తీసుకెళ్లేటప్పుడు పటిష్ఠమైన బందోబస్తు ఉండాలి. పరీక్ష పత్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ లీక్‌ కాకుండా చర్యలు చేపట్టాలి. అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటుచేయాలి. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలి. మార్చి 18 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 2 వరకూ జరుగుతాయి. వీటికి 5.08 లక్షల మంది హాజరవుతారు. విద్యార్థినీ, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తగినన్ని ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా తగు చర్యలు తీసుకోవాలి. పరీక్ష కేంద్రాల వద్ద ప్రాథమిక చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి’’ అని సీఎస్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



    టీఎస్‌పీఎస్సీజూనియ‌ర్ ఇంట‌ర్‌ స్టడీమెటీరియల్

♦ గణితశాస్త్రం 1A
♦ రసాయన శాస్త్రం
♦ వృక్షశాస్త్రం 
♦ జంతుశాస్త్రం
♦ భౌతికశాస్త్రం
♦ గణితశాస్త్రం 1B
►పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు 
నమూనా ప్రశ్నపత్రాలు 


 

  టీఎస్‌పీఎస్సీ సీనియ‌ర్ ఇంట‌ర్‌ స్టడీమెటీరియల్  

♦ గణితశాస్త్రం 2A
♦ గణితశాస్త్రం 2B
♦ భౌతికశాస్త్రం
♦ జంతుశాస్త్రం
♦ రసాయన శాస్త్రం
♦ వృక్షశాస్త్రం
 పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు 
 నమూనా ప్రశ్నపత్రాలు 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఉద్వేగాల నియంత్రణ.. ఉద్యోగాలకు సాధన

‣ పీఎన్‌బీలో 1,025 కొలువులు

‣ సివిల్స్‌ సన్నద్ధత!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.