• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్‌హెచ్‌పీసీలో 388 కొలువులు

జూనియర్‌ ఇంజినీర్‌, సూపర్‌వైజర్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌

హరియాణా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌ ఉన్న ప్రభుత్వరంగ సంస్థ.. మినీరత్న కేటగిరీ నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో జరిగే కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మొత్తం 388 పోస్టులో జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌) 149, జూనియర్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) 74, జూనియర్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌) 63, జూనియర్‌ ఇంజినీర్‌ (ఈఅండ్‌సీ) 10, సూపర్‌వైజర్‌ (ఐటీ) 9, సూపర్‌వైజర్‌ (సర్వే) 19, సీనియర్‌ అకౌంటెంట్‌ 28, హిందీ ట్రాన్స్‌లేటర్‌ 14, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (సివిల్‌) 14, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (ఎలక్ట్రికల్‌/మెకానికల్‌) 8 ఉన్నాయి. 

అభ్యర్థులకు పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 30.06.2023 నాటికి వయసు 30 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు కేటగిరీని బట్టి 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు పీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు రూ.295. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు లేదు. 

పరీక్ష ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో 200 మార్కులకు ఉంటుంది. వ్యవధి 3 గంటలు. ప్రశ్నలు మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటాయి. దీంట్లో జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 40 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు 35 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కు తగ్గిస్తారు. డిస్క్రిప్టివ్‌ విధానంలోని ప్రశ్నలకు 10 మార్కులు ఉంటాయి. వీటికి రుణాత్మక మార్కులు లేవు.

జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌/ ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌/ ఈఅండ్‌సీ), సూపర్‌వైజర్‌ (ఐటీ), సూపర్‌వైజర్‌ (సర్వే), సీనియర్‌ అకౌంటెంట్, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (సివిల్‌), డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (ఎలక్ట్రికల్‌/మెకానికల్‌) పోస్టులకు నిర్వహించే రాత పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. పార్ట్‌-1లో సబ్జెక్టు సంబంధిత సబ్జెక్టులో 140, పార్ట్‌-2లో జనరల్‌ అవేర్‌నెస్‌ 30, పార్ట్‌-3లో రీజనింగ్‌ 30 ప్రశ్నలు ఉంటాయి. 

హిందీ ట్రాన్స్‌లేటర్‌ ప్రశ్నపత్రంలోనూ 3 భాగాలు, మొత్తం 110 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్‌-1లో సబ్జెక్టుకు సంబంధించిన 40 మల్టీఛాయిస్, 10 డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. పార్ట్‌-2లో జనరల్‌ అవేర్‌నెస్‌ ప్రశ్నలు 30, పార్ట్‌-3లో రీజనింగ్‌ ప్రశ్నలు 30 ఉంటాయి. 

పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, దేహ్రాదూన్, దిల్లీ, గ్యాంగ్‌టక్, గువాహటీ, హైదరాబాద్, ఈటానగర్, జైపుర్, జమ్మూ, కోల్‌కతా, అఖ్‌నవూ, ముంబయి, రాంచీ. 

దరఖాస్తుకు చివరి తేదీ: 30.06.2023  

వెబ్‌సైట్‌: https://www.nhpcindia.com/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ‘పది’తో ప్రభుత్వోద్యోగాలెన్నో!

‣ సబ్జెక్టులపై పట్టు.. అధిక సాధన!

‣ ‘నీట్‌’ చక్రవర్తి ప్రథమ ర్యాంకర్‌ అనుసరించిన వ్యూహం

‣ ఐటీబీపీలో హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు

‣ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 153 నాన్‌ టీచింగ్‌ ఖాళీలు

‣ సత్వర ఉపాధికి డిప్లొమా మార్గం

‣ టీహెచ్‌డీసీఐఎల్‌లో 181 జూనియర్‌ ఇంజినీర్‌ కొలువులు

Posted Date : 21-06-2023 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం