ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్‌సెట్) 2024 నోటిఫికేషన్‌ను ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 18 నుంచి మే 15 వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష వివరాలు...
* ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్‌సెట్) 2024
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. బీటెక్, బీసీఏ, బీబీఎం విద్యార్థులూ అర్హులే. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్ట్‌లనే ఎడ్‌సెట్‌లో మెథడాలజీ సబ్జెక్టులుగా ఎంచుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం: మూడు విభాగాలుగా 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు.
రిజిస్ట్రేషన్ ఫీజు: ఎస్సీ/ ఎస్టీలకు రూ.450; బీసీలకు రూ.500; ఓసీలకు రూ.650.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 18-04-2024.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 15-05-2024.
ఆలస్య రుసుము రూ.1000తో దరఖాస్తుకు చివరి తేదీ: 16-05-2024 నుంచి 19-05-2024 వరకు.
ఆలస్య రుసుము రూ.2000తో దరఖాస్తుకు చివరి తేదీ: 20, 21-05-2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 22-05-2024 నుంచి 25-05-2024 వరకు.
హాల్ టిక్కెట్ల డౌన్లోడ్: 30-05-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 08-06-2024.
ప్రిలిమినరీ కీ విడుదల: 15-06-2024.
ప్రిలిమినరీ కీపై అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ: 18-06-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్ ఆవాసాలు!
‣ ఆఫర్ లెటర్ అందుకుంటే సరిపోదు!
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
RGUKT AP: ట్రిపుల్ఐటీ-ఏపీలో పీయూసీ, బీటెక్ ప్రోగ్రామ్
LPU: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్
డీఏఐఐసీటీలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలు
NIEPA: దిల్లీ, ఎన్ఐఈపీఏలో ప్రవేశాలు
BU: భారతియార్ యూనివర్సిటీలో పీజీ ప్రవేశాలు
LPU: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్ (సీఎస్ఈ) ప్రోగ్రామ్
GRI: గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్లో యూజీ, పీజీ, డిప్లొమా ప్రోగ్రామ్
TS DOST: తెలంగాణ స్టేట్ దోస్త్-2024
Joint CSIR-UGC NET: జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2024
UOH: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పీజీ ప్రోగ్రామ్
SPKM IIHT: ఐఐహెచ్‌టీలో డిప్లొమా కోర్సులు
TTD: సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
APTWREIS: ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
AUDOA: ఏయూ విశాఖపట్నంలో ఎంబీఏ ప్రోగ్రామ్
NFSU: ఎన్ఎఫ్ఎస్యూ 2024-25 ప్రవేశాలు
AUDOA: ఏయూ విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ బీబీఏ-ఎంబీఏ ప్రోగ్రామ్
NIPER JEE: నైపర్ జేఈఈ 2024- పీహెచ్డీ ప్రోగ్రాం
NIPER JEE: నైపర్ జేఈఈ 2024- మాస్టర్స్ ప్రోగ్రామ్
UOH: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఎంటెక్ ప్రోగ్రామ్
IIITDM: ట్రిపుల్ ఐటీడీఎం కర్నూలులో పీహెచ్డీ ప్రోగ్రాం