ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పాఠశాల విద్యాశాఖ 'ఉపాధ్యాయ అర్హత పరీక్ష' (ఏపీ టెట్ జులై-2024) ప్రకటనను విడుదల చేసింది. దీనికి ఉపాధ్యాయ నియామక పరీక్షలో 20% వెయిటేజీ కూడా ఉంది. పేపర్-1ఏ ఎస్జీటీ టీచర్లకు, పేపర్-1బీ ప్రత్యేక విద్య ఎస్జీటీ టీచర్లకు నిర్వహించనున్నారు. పేపర్-2ఏ స్కూల్ అసిస్టెంట్లకు, పేపర్-2బీ ప్రత్యేక విద్య స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లకు ప్రత్యేకంగా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు 1-5 తరగతుల బోధనకు పేపర్-1(ఎ, బి); 6-8 తరగతుల బోధనకు పేపర్-2(ఎ, బి)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అర్హులైన వారు ఆగస్టు 3వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. టెట్ స్కోర్‌కు జీవిత కాల గుర్తింపు ఉంటుంది.
పరీక్ష వివరాలు...
* ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జులై-2024
అర్హతలు: పేపర్‌ను బట్టి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు డీఈడీ/ బీఈడీ/ లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమానం. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి ఏడాది చదివే అభ్యర్థులూ అర్హులే.
కమ్యూనిటీ వారీ ఉత్తీర్ణతా మార్కులు
1. ఓసీ(జనరల్)- 60% మార్కులు ఆపైన
2. బీసీ- 50% మార్కులు ఆపైన
3. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్/ ఎక్స్ సర్వీస్‌మెన్- 40% మార్కులు ఆపైన
టెట్ ప్రశ్నపత్రాలు:
* పేపర్-1ఎ, పేపర్-1బి: 5 విభాగాల్లో 150 ప్రశ్నలు- 150 మార్కులకు నిర్వహిస్తారు.
* పేపర్-2ఎ, పేపర్-2బి: 4 విభాగాల్లో మొత్తం 150 ప్రశ్నలు- 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)గా నిర్వహిస్తారు. రోజుకు రెండు సెషన్లలో ఉంటుంది. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది.
పరీక్ష రుసుము: రూ.750.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
ముఖ్య తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: 02/07/2024.
దరఖాస్తు రుసుములు చెల్లింపులు: 03/07/2024 నుంచి 03/08/2024 వరకు.
ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణ: 03/07/2024 నుంచి 03/08/2024 వరకు.
ఆన్లైన్ మాక్ టెస్ట్ సదుపాయం: 19/09/2024 నుంచి.
హాల్‌టిక్కెట్ డౌన్లోడ్: 22/09/2024 నుంచి.
పరీక్షల నిర్వహణ: 03/10/2024 నుంచి 20/10/2024 వరకు.
ప్రాథమిక ‘కీ’ విడుదల: 04/10/2024.
అభ్యంతరాల స్వీకరణ: 05/10/2024 నుంచి.
తుది ‘కీ’ విడుదల: 27/10/2024.
ఫలితాల ప్రకటన: 02/11/2024.
పరీక్ష సమయం:
సెషన్-1: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.
సెషన్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి
‣ పవర్ గ్రిడ్‌లో 435 ఇంజినీర్ ట్రెయినీ ఉద్యోగాలు
‣ తీర రక్షక దళంలో నావిక్, యాంత్రిక్ కొలువులు
‣ క్లౌడ్ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు
‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
CUJ: ఝార్ఖండ్ సెంట్రల్ యూనివర్సిటీలో టీచింగ్ ఉద్యోగాలు
NEEPCO: ఎన్ఈఈపీసీఓలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
SBI SCO: స్టేట్ బ్యాంకులో 1,040 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు
NTPC: ఎన్టీపీసీలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
IIMV: వైజాగ్ ఐఐఎంలో నాన్ టీచింగ్ ఖాళీలు
NCGTC: ఎన్సీజీటీసీ, ముంబయిలో మేనేజీరియల్ పోస్టులు
NIHMAS: బెంగళూరు నిమ్హాన్స్లో ఖాళీలు
IHM: హైదరాబాద్ ఐహెచ్ఎంలో ఖాళీలు
ITI Limited: ఐటీఐ లిమిటెడ్, బెంగళూరులో మేనేజీరియల్ పోస్టులు
NPCIL: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ఉద్యోగాలు
GDS POSTAL JOBS: తపాలా శాఖలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు
IIT Hyderabad: హైదరాబాద్ ఐఐటీలో ఎంఎల్ ఇంజినీర్ పోస్టులు
CRPF: సీఆర్పీఎఫ్లో 22 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
Indian Army: ఇండియన్ ఆర్మీలో 57వ కోర్సు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్
MECON: మెకాన్ లిమిటెడ్‌లో 309 ఇంజినీరింగ్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో ఎస్సై స్టాఫ్ నర్స్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
SAIL: సెయిల్‌లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
AFMS: ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 450 మెడికల్ ఆఫీసర్ పోస్టులు
IITM: పుణె ఐఐటీఎంలో రిసెర్చ్ ఫెలో పోస్టులు