• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NPCIL: న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు 

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బులంద్‌షహర్ జిల్లాలోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌)కు చెందిన నరోరా అటామిక్‌ పవర్‌ స్టేషన్‌.. రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టుల వివరాలు

1. నర్స్‌-ఎ: 01 పోస్టు

2. కేటగిరీ-1 స్టైపెండరీ ట్రైనీ / సైంటిఫిక్‌ అసిస్టెంట్‌/ సైన్స్‌ గ్రాడ్యుయేట్లు: 12 పోస్టులు

3. కేటగిరీ-2 స్టైపెండరీ ట్రైనీ/ టెక్నీషియన్‌: 60 పోస్టులు

4. ఎక్స్‌రే టెక్నీషియన్‌: 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 74 పోస్టులు

అర్హత:  పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత విభాగంలో డిప్లొమా (నర్సింగ్),  బీఎస్సీ (కెమిస్ట్రీ/ మ్యాథమెటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌), డిగ్రీ, బీఈ/బీటెక్‌ (మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: నర్స్‌-ఎ పోస్టుకు 30 ఏళ్లు, కేటగిరీ-1 స్టైపెండరీ ట్రైనీ, ఎక్స్‌రే టెక్నీషియన్  పోస్టులకు 25 ఏళ్లు, కేటగిరీ-2 స్టైపెండరీ ట్రైనీ పోస్టుకు 24 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు దివ్యాంగులకు 10 ఏళ్లు

సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు నర్స్‌-ఎ పోస్టుకు రూ.67,350, కేటగిరీ-1 స్టైపెండరీ ట్రైనీ పోస్టుకు రూ.53,100, కేటగిరీ-2 స్టైపెండరీ ట్రైనీ పోస్టుకు రూ.32,550, ఎక్స్‌రే టెక్నీషియన్ పోస్టుకు రూ.38,250.

దరఖాస్తు ఫీజు: నర్స్‌-ఎ, కేటగిరీ-1, 2 స్టైపెండరీ ట్రైనీ రూ.150, ఎక్స్‌రే టెక్నీషియన్‌ పోస్టుకు రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్‌మెన్‌/ దివ్యాంగులు/ మహిళలకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన, ఫిజికల్ స్టాండర్డ్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 16-07-2024.

దరఖాస్తు చివరి తేదీ: 05-08-2024.
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!

‣ జాబ్‌ మార్కెట్‌లో ఏఐ జోరు!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 18-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :