• facebook
  • whatsapp
  • telegram

మరపు ఎందుకు వస్తుంది?

ఒక వ్యక్తి ఒక విషయాన్ని తాత్కాలికంగా మరచిపోవడానికి లేదా ఒక విషయం వెంటనే గుర్తు రాకపోవడానికి పలు కారణాలుంటాయి. వాటిని పరిశీలిద్దాం.

ఉద్వేగాలు: ఒత్తిడి, ఆందోళన వంటి ప్రతికూల ఉద్వేగాలతో ఉన్నప్పుడు చదివింది గుర్తు రాకపోవచ్చు. ఈ ఉద్వేగాలు దీర్ఘకాలం ఉంటే మందులు వాడాల్సి ఉంటుంది. దానివల్ల ఉద్వేగాలు తగ్గి విషయాలు గుర్తుంటాయి.

అలసట: అలసటవల్ల కూడా కొన్నిసార్లు విషయాలను మరచిపోతాం. పని ఎక్కువగా చేసినా, తగినంత విశ్రాంతి లేకపోయినా ఆ మర్నాడు ఏదీ గుర్తుండదు.

మందుల వాడకం: కొన్ని రకాల జబ్బులకు మందులు వాడటంవల్ల వాటి సైడ్ఎఫెక్ట్ జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపవచ్చు. దీనికి నిపుణులైన డాక్టర్ల సలహాలు, సూచనలు పాటించాల్సి ఉంటుంది.

గుర్తుంచుకునే మార్గాలు:

1. రిహార్సల్: గుర్తుంచుకునే సమాచారాన్ని పదేపదే చదవడం, రాయడం, చూడకుండా అప్పజెప్పడం, ఉచ్ఛారణను జాగ్రత్తగా గమనించడం ఇది అందరికీ తెలిసిన పద్ధతి.

2. విభజించడం:  సమాచారాన్ని ఒక క్రమంలో రాసుకుని ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో విభజించుకుంటే గుర్తుంచుకోవడం కొంత తేలికవుతుంది.

3. దృశ్యరూపం:  చదివినదాన్ని దృశ్యంగా చూడగలగడం.

4. లింకింగ్:  ఒక వాక్యానికి మరో వాక్యానికి లింకులను ఏర్పరచుకోవడం.

5. అసోసియేషన్:  మన వద్ద ఉన్న సమాచారాన్ని మరో సమాచారంతో చేర్చడం.

6. పాటలరూపంలో:  సమాచారాన్ని పాటల రూపంలో లేదా రైమ్సుగా గుర్తుంచుకోవడం.

7. మొదటి అక్షరాలన్నీ కలిపి ఒక వింత మాటలా తయారుచేసి గుర్తుంచుకోవటం,  ఉదా: విబ్జార్ అంటే హరివిల్లు, ఇంద్రధనుస్సులోని రంగులు.

Violet, Indigo, Blue, Green, Yelloe, Orange, Red

ఈ రంగులన్నీ కలిస్తే VIBGYOR

8. న్యూరోబిక్స్ ద్వారా గుర్తుంచుకోవడం: ఏరోబిక్స్ ఎక్సర్‌సైజ్ వల్ల శరీర ఆరోగ్యం బాగుంటుంది. అలాగే న్యూరోబిక్స్ ఎక్సర్‌సైజ్ ద్వారా పదాలు గుర్తుంటాయి.

దీన్ని ప్రవేశ పెట్టినవారు మేనింగ్ రూబిన్. న్యూరోబిక్స్ అంటే మనస్సులో నిత్యం మననం చేసుకోవడం. మెమొరీ అంటే మార్పులు లేనిదికాదు. అందులో మార్పు ఉంటుంది. అదొక నెట్‌వర్క్ వంటిది. ఇందులో మీ ఒకాబ్యులరీ, ఉద్వేగాలు రికార్డు అవుతాయి.

     కార్డు, రూబిన్‌ల దృష్టిలో చిన్న పిల్లలకి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ప్రతీ విషయం బాగా గుర్తుంటుంది. వారిలో 'మల్టీ సెన్సరీ సిస్టమ్' ఉంటుంది. అంటే బాగా చూస్తారు, వింటారు, రుచి చూస్తారు, తాకుతారు, వాసన పసికడతారు. వారి చుట్టుపక్కల జరిగే ప్రతీ విషయాన్ని నిశితంగా గమనిస్తూ ఉంటారు. అదే పెద్దవారైతే చూస్తారు. వింటారు, మిగతా ఇంద్రియాల జోలికిపోరు. ఒక్క 'వాసన మాత్రం నేరుగా మెదడులోని కార్టెక్సులోకి ప్రవేశిస్తుంది.

Posted Date: 11-09-2020


 

జ్ఞాపకశక్తి

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం