• facebook
  • whatsapp
  • telegram

ప్రేరణ లోపిస్తోందా?



ఉత్సాహంగా సన్నద్ధత సాగించాల్సిన విద్యార్థులూ, ఉద్యోగార్థులూ ఏదోక సందర్భంలో ప్రేరణ కోల్పోతుంటారు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే...


ఒక్కోసారి బాగా అలసిపోతుంటారు. తరగతులకు హాజరుకావడం, చదవడం అంతా భారంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు శరీరానికి తగిన విశ్రాంతినివ్వాలి. ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో అన్ని పనులూ చేయగలుగుతారు. 


చదువుకుంటుండగా మధ్యలో ఫోన్‌ మెసేజ్‌లు, వీడియోలు చూడటం వల్ల గంటా, రెండు గంటల సమయం వృథా కావచ్చు. తిరిగి పుస్తకం పట్టుకోవాలనే ఆసక్తి తగ్గిపోవచ్చు. కాబట్టి చదివేటప్పుడు ఫోన్‌ను స్విచ్చాఫ్‌ చేయడం లేదా సైలెంట్‌లో పెట్టడం  చేయాలి. 


చేతిలో పుస్తకం ఉంటే.. చదువుతున్న పాఠం గురించి మాత్రమే ఆలోచించాలి. జరిగిన విషయాలు బాధపెట్టొచ్చు, జరగబోయేవి భయపెట్టొచ్చు. కానీ వర్తమానం గురించి మాత్రమే ఆలోచించడం వల్ల ప్రేరణను కొనసాగించగలుగుతారు. 


చేసే ప్రతి పని వెనకా కొన్ని ఆలోచనలు ఉంటాయి. అవే ముందుకు నడిపిస్తూ ఉంటాయి. నిర్దేశించుకున్న లక్ష్యాలనూ, ఉన్నత ఆశయాలనూ పదేపదే గుర్తుచేసుకోవాలి. ఇవి చుక్కానిలా జీవితనౌకను ముందుకు నడిపిస్తాయి. 


‘ఫలానా కోర్సులో నీకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్లకే సీటు రాలేదు. ఇంక నీకెక్కడ వస్తుంది?’, ‘ఇంత చిన్న విషయం నీకు అర్థంకాలేదా? వచ్చే ఏడాది చదవబోయే అంశాలు ఇంకా కష్టంగా ఉంటాయి. అప్పుడేం చేస్తావో?’ ఇలా కొందరు అదే పనిగా నిరుత్సాహపరుస్తుంటారు. అలాంటి వారికి సాధ్యమైనంత దూరంగా ఉంటేనే మంచిది. 


సందేహాలు, విమర్శలూ, భయాలు.. వీటన్నింటినీ పక్కన పెట్టేస్తే అనుకున్నది తప్పకుండా సాధించగలుగుతారు.


ఎక్కువగా ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల ప్రారంభించబోతున్న పని కాదేమోననే సందేహాలు వస్తుంటాయి. ఇలాంటి వాటికి అవకాశం లేకుండా.. చేయాలనుకున్న పనిని వెంటనే మొదలుపెట్టాలి. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో!

‣ మాట తీరు ఎలా ఉండాలి?

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

‣ అవగాహనతో అధిక మార్కులు!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

Posted Date: 22-07-2024


 

ప్రేరణ