• facebook
  • whatsapp
  • telegram

Constable GD Result: త్వరలో కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు

* 46,617 పోస్టుల భర్తీ

* ఈవెంట్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులు
 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (జీడీ) నియామక రాత పరీక్ష ఫలితాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఈ మేరకు ఫలితాల వెల్లడికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) సమాయత్తమవుతోంది. ఖాళీల వివరాలను సవరిస్తూ ఇటీవల రివైజ్‌డ్‌ నోటీసును కమిషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్‌లో 26,146 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఎస్‌ఎస్‌సీ... భారీ సంఖ్యలో నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రకటించింది. దాదాపు 20,471 పోస్టులను అదనంగా చేర్చింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 46,617కి చేరింది. త్వరలో దేశ వ్యాప్తంగా వివిధ సాయుధ బలగాల్లో మొత్తం 46,617 కానిస్టేబుల్ ఖాళీలు భర్తీ చేయనున్నట్లు కమిషన్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించనున్న అభ్యర్థులు తదుపరి ఎంపిక ప్రక్రియకు సన్నద్ధమవుతున్నారు.

వివిధ దశల అనంతరం అభ్యర్థుల ఎంపిక

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్‌)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్ (ఏఆర్‌)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ) పోస్టులు భర్తీకి ఎస్‌ఎస్‌సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్ష ఫిబ్రవరి, మార్చి నెలలో జరిగాయి. ఏప్రిల్‌ 3న ఆన్సర్‌ కీ విడుదల కాగా అభ్యంతరాలను స్వీకరించింది. త్వరలోనే రాత పరీక్ష ఫలితాలు వెల్లడికానున్నాయి. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. పీఈటీ/ పీఎస్‌టీ పాసైన వారికి వైద్య పరీక్షలు అనంతరం ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. ఈ క్రమంలో రిజర్వేషన్‌ అనుసరించి అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.
 

  ఖాళీల వివరాలు...  
 

 * కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ)/ రైఫిల్‌మ్యాన్(జనరల్ డ్యూటీ): 46,617 పోస్టులు  
సాయుధ బలగం      మొత్తం ఖాళీలు పురుషులు  మహిళలు
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌)    12,076 10227 1849
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్‌)   13,632 11,558 2,074
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్‌)  9,410   9,301  109
సశస్త్ర సీమ బల్(ఎస్‌ఎస్‌బీ)  1,926 1,884   42
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)  6,287 5,327  960
అస్సాం రైఫిల్స్(ఏఆర్‌) 2,990 2,948  42
సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎస్‌ఎస్‌ఎఫ్‌) 296 222 74



  కేటగిరి వారీగా కానిస్టేబుల్ ఖాళీల వివరాల కోసం క్లిక్‌ చేయండి  

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.