* 46,617 పోస్టుల భర్తీ
* త్వరలో ఫలితాలు విడుదల
ఈనాడు ప్రతిభ డెస్క్: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (జీడీ) నియామకాలకు సంబంధించి ఖాళీల వివరాలను సవరిస్తూ తాజాగా రివైజ్డ్ నోటీసును స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) విడుదల చేసింది. గతేడాది నవంబర్‌లో 26,146 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఎస్సీ... తాజాగా భారీ సంఖ్యలో నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రకటించింది. దాదాపు 20,471 పోస్టులను అదనంగా చేర్చింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 46,617కి చేరింది. త్వరలో దేశ వ్యాప్తంగా వివిధ సాయుధ బలగాల్లో మొత్తం 46,617 కానిస్టేబుల్ ఖాళీలు భర్తీ చేయనున్నట్లు కమిషన్ పేర్కొంది.
వివిధ దశల అనంతరం అభ్యర్థుల ఎంపిక
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్ఎస్బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ) పోస్టులు భర్తీకి ఎస్ఎస్సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్ష ఫిబ్రవరి, మార్చి నెలలో జరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 3న ఆన్సర్ కీ విడుదల కాగా అభ్యంతరాలను స్వీకరించింది. త్వరలోనే రాత పరీక్ష ఫలితాలు వెల్లడికానున్నాయి. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.
ఖాళీల వివరాలు...
* కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ)/ రైఫిల్‌మ్యాన్(జనరల్ డ్యూటీ): 46,617 పోస్టులు
1. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్): 12,076 పోస్టులు(పురుషులు- 10227; మహిళలు- 1849)
2. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్): 13,632 పోస్టులు(పురుషులు- 11,558; మహిళలు- 2,074)
3. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్): 9,410 పోస్టులు(పురుషులు- 9,301; మహిళలు- 109)
4. సశస్త్ర సీమ బల్(ఎస్ఎస్బీ): 1,926 పోస్టులు(పురుషులు- 1,884; మహిళలు- 42)
5. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ): 6,287 పోస్టులు(పురుషులు- 5,327; మహిళలు- 960)
6. అస్సాం రైఫిల్స్(ఏఆర్): 2,990 పోస్టులు (పురుషులు- 2,948; మహిళలు- 42)
7. సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎస్ఎస్ఎఫ్): 296 పోస్టులు (పురుషులు- 222; మహిళలు- 74)
కేటగిరి వారీగా కానిస్టేబుల్ ఖాళీల వివరాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.