* జూన్ 20వ తేదీ వరకు అవకాశం
ఈనాడు, హైదరాబాద్: డీఎస్సీకి ఇప్పటివరకు దరఖాస్తు చేయని వారు, తాజా టెట్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు వెబ్సైట్లో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది. ఉచితంగా దరఖాస్తు విధానం శనివారం రాత్రి (జూన్ 15) నుంచి అందుబాటులోకి వచ్చింది. టెట్‌కు దరఖాస్తు గడువు పెంచడం... దాన్ని తగ్గించాలని అభ్యర్థులు కోరడం తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 12వ తేదీన ఆనాడు దరఖాస్తు ఫీజు తగ్గించలేని పరిస్థితి ఉన్నందున డీఎస్సీకి ఉచితంగా అవకాశం ఇస్తామని విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెట్ పాస్‌కాని వారు మాత్రం వచ్చేసారి నిర్వహించే పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
టీఆర్టీ/డీఎస్సీ తెలంగాణ
మరిన్ని వాటి కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.