• facebook
  • whatsapp
  • telegram

EAPCET 2024 results: నేడే ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల 


* మొత్తం 3,39,139 మంది పరీక్షకు హాజరు

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ ఫలితాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నట్లు సెట్‌ ఛైర్మన్, జేఎన్‌టీయూ-కాకినాడ వీసీ ప్రసాదరాజు తెలిపారు. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ రామమోహన్‌రావుతో కలిసి ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఈఏపీసెట్‌ను జేఎన్‌టీయూ- కాకినాడ నిర్వహించింది. మొత్తం 3,62,851 మంది దరఖాస్తు చేయగా.. వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌కు సంబంధించి 2,58,373 మంది, వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు కలిపి 80,766 మంది పరీక్షలు రాశారు. ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. దీని ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు.


    ఫలితాల కోసం క్లిక్‌ చేయండి  
 

   ఏపీ ఈఏపీసెట్‌  2024  ఫలితాలు   

 ఇంజినీరింగ్

 అగ్రిక‌ల్చ‌ర్ & మెడిక‌ల్‌



 

  ఏపీ ఈఏపీసెట్‌ మాక్ కౌన్సెలింగ్స్ - 2024 


‣ ఇంజినీరింగ్

‣ అగ్రిక‌ల్చ‌ర్ & మెడిక‌ల్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.