• facebook
  • whatsapp
  • telegram

ECET ICET Results: వచ్చేస్తున్నాయ్‌ ఈసెట్‌, ఐసెట్‌ ఫలితాలు

* రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే..



 


ఈనాడు ప్రతిభ డెస్క్‌: పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈసెట్‌-2024 ఫలితాలను అనంతపురం జేఎన్‌టీయూలో గురువారం (మే 30) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. మే 8న ఈ పరీక్షలు జరగ్గా.. రాష్ట్రవ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్‌-2024 ఫలితాలు గురువారం (మే 30) సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. మే 6న ఏపీలో 111, తెలంగాణలో 2 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 48,828 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 44,446 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను https://results.eenadupratibha.net/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.