• facebook
  • whatsapp
  • telegram

Education: వసతి గృహాల్లో ట్యూటర్లను నియమించుకోవాలి  

* బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత
 


ఈనాడు, అమరావతి: వసతి గృహ విద్యార్థులను సొంత బిడ్డల్లాగా చూసుకోవాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అధికారులకు సూచించారు. వెలగపూడిలోని సచివాలయంలో జులై 9న  అధికారులతో వసతి గృహాల నిర్వహణపై సమీక్షించారు. ‘వసతి గృహ నిర్వహణపై కొన్ని చోట్ల ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని సరిచేసుకోవాలి. నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలి. విద్యార్థులు సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా రెగ్యులర్‌గా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. పిల్లలకు మెరుగైన విద్య అందేలా ట్యూటర్లను నియమించుకోవడంతోపాటు ప్రత్యేక తరగతులూ నిర్వహించాలి. వసతి గృహ సంక్షేమ అధికారి తప్పనిసరిగా హెడ్‌ క్వార్టర్‌లో లేకపోతే చర్యలు తీసుకుంటాం. ప్రతి నెలా క్రమం తప్పకుండా పిల్లల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి’ అని స్పష్టం చేశారు. గతేడాది డిసెంబరు నుంచి డైట్, కాస్మొటిక్‌ ఛార్జీలు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. సీఎంతో మాట్లాడి త్వరగా మంజూరయ్యేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారులు కలెక్టర్లతో సమన్వయం చేసుకుని సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ ద్వారా వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. 
 



మరింత సమాచారం... మీ కోసం!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు!

‣ ప్రయత్నాలను మధ్యలో ఆపేయొద్దు! !

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.