• facebook
  • whatsapp
  • telegram

Hyderabad: అడవి బిడ్డ.. అదరగొట్టె

* మూడు కొలువులు సాధించిన నేనావత్‌ స్వాతి

మహేశ్వరం, న్యూస్‌టుడే: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సాధించడమే కష్టం. అలాంటిది మూడు ఉద్యోగాలు సాధించి గిరిజన మహిళ సత్తా చాటింది.. మహేశ్వరంలోని కావాలోనిభాయి తండా (కేబీతండా)కు చెందిన నేనావత్‌ స్వాతి.. నిరుపేద కుటుంబానికి చెందిన ఈమె.. గురుకుల విద్యాలయ ఉద్యోగ నియామక ఫలితాల్లో జూనియర్‌ కళాశాల రసాయన శాస్త్ర అధ్యాపకురాలిగా, పీజీటీ-ఫిజికల్‌ సైన్స్‌, టీజీటీ- ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయురాలిగా అర్హత సాధించింది.. కష్టాలను అధిగమించి ఇతరులకు స్వాతి స్ఫూర్తిగా నిలుస్తోంది. కుటుంబ బాధ్యతలు మోస్తూనే పీహెచ్‌డీ చదువుతోంది. ఐదున్నరేళ్ల కుమారుడిని చూసుకుంటూనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. కలల కొలువు సాధించడానికి నిరంతరం శ్రమించింది. భర్త గణేష్‌, తల్లి జీజాభాయి, తండ్రి లక్ష్మణ్‌నాయక్‌ల సహకారంతో తాను కొలువులు సాధించినట్లు ఆమె చెప్పింది. తల్లిదండ్రులిద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కష్టాన్ని చూసి.. చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి చదువుకున్నట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం ఐఐసీటీ-హబ్సిగూడలో పీహెచ్‌డీ చేస్తున్నట్లు వెల్లడించింది.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు

‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.