• facebook
  • whatsapp
  • telegram

IBPS Clerk Recruitment: గ్రామీణ బ్యాంకుల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల


 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (ఐబీపీఎస్‌) 2024-2025 సంవత్సరానికి సంబంధించి రీజినల్‌ రూరల్‌ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XIII (సీఆర్‌పీ) నోటిఫికేష‌న్ (గురువారం) జూన్‌ 6న విడుద‌ల చేసింది. దీని ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస‌ర్(స్కేల్‌-1, 2, 3), ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌)/ క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి చర్యలు చేపట్టనుంది. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఖాళీలుంటాయి. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు...

* గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్స్‌(స్కేల్‌- I, II, III), ఆఫీస్‌ అసిస్టెంట్స్‌ (మల్టీపర్పస్‌) పోస్టులు
ఖాళీలు భర్తీ కానున్న బ్యాంకులు: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్ తదితరాలు.

అర్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వ‌య‌సు: ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్) పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి ప్రిలిమ్స్ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ముఖ్య తేదీలు (ఐబీపీఎస్‌ క్యాలెండర్‌ 2024 ప్రకారం)...

దరఖాస్తు ప్రారంభం: 07-06-2024.

దరఖాస్తుకు చివరి తేదీ: 27-06-2024.

ప్రిలిమిన‌రీ పరీక్ష : 03.08.2024, 04.08.2024, 10.08.2024, 17.08.2024, 18.08.2024.

మెయిన్ పరీక్ష తేదీ: 29.09.2024, 06.10.2024.

వెబ్‌సైట్‌: https://www.ibps.in/
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.