• facebook
  • whatsapp
  • telegram

Job: వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీకి అధికంగా దరఖాస్తులు

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు అధికంగా వస్తున్నాయి. 45 పోస్టులకుగాను రెండో రోజు మార్చి 1 నాటికి 500కు పైగా అర్జీలు వచ్చాయి. మార్చి 2 సాయంత్రం వరకు గడువు ఉండటంతో వీటి సంఖ్య పెరగనుంది. జాతీయ హెల్త్‌ మిషన్‌ పథకం ద్వారా వీటిని భర్తీ చేస్తారు. ప్రోగ్రాం అధికారి పోస్టు మొదలుకొని వైద్యులు, స్టాఫ్‌నర్సులు వంటివి మొత్తం ఎనిమిది విభాగాల పోస్టులు ఉన్నాయి. మార్చి 1 మధ్యాహ్నం కల్లా 500లకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వివరించారు. స్టాఫ్‌ నర్సు పోస్టులకు మూడు వందలకు పైగా వచ్చాయి. మిగిలిన వాటిలో ఒక బీఎంహెచ్‌ వైద్యుడు, ఇతర 13 పోస్టులకుగాను 80 రాగా ఇతర పోస్టులకు 10-30 వరకు అర్జీలు వచ్చాయి.


మెరిట్‌ ఆధారంగా ఎంపిక

ఈ పోస్టులన్నీ ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తాం. ఎలాంటి సిఫార్సులకు అవకాశం లేదు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీ నియామకాలు పూర్తి చేస్తుంది. పూర్తి పారదర్శకత ఉంటుంది. పైరవీకారుల మాటలు నమ్మొద్దు.

- డాక్టర్‌ సుజాత, డీఎంహెచ్‌వో

దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు

పోస్టులు  ఖాళీల సంఖ్య

వైద్యాధికారి 4

స్టాఫ్‌నర్సులు 21

వైద్యులు స్టాఫ్‌నర్సులు 13

జిల్లా ప్రోగ్రాం అధికారి 1

ఏఎన్‌ఎం 1

ఫార్మసిస్ట్‌ 3

ఇతర ఉద్యోగాలు 2

మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)

‣ గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ ప్లాన్‌ (టీఎస్‌పీఎస్సీ)

‣ ‘ట్రిపుల్‌ ఆర్‌’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!

‣ సివిల్స్‌ సన్నద్ధత!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.